దేశంలో కరోనా వైరస్ కేసులు ప్రతిరోజూ పెరిగిపోతూనే ఉన్నాయి. ఆ మద్య మంచినీటి సమస్యను చెప్పుకోవడానికొచ్చిన ఓ మహిళపై బీజేపీ ఎమ్మెల్యే బలరాం తవాని, ఆయన అనుచరులు విచక్షణారహితంగా దాడికి దిగారు. మహిళ అని కూడా చూడకుండా ఎమ్మెల్యే బలరాం ఆమెను కాలితో తన్నారు. ఈ దారుణమైన ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరం నరోదా నియోజకవర్గంలో బలరాం కార్యాలయం ఎదుట జరిగిన విషయం తెలిసిందే.  నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు నీతు తేజ్వానీ, మరికొంత మంది మహిళలతో కలిసి తమ ప్రాంతంలో ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరించాలని బలరాం తవాని కార్యలయం ఎదుట నిరసనకు దిగారు.

IHG

అయితే సమస్య పరిష్కరించేందుకు మార్గం చూడకుండా కనీసం హామీ ఇవ్వకుండా మహిళ అని చూడకుండా.. ఆగ్రహానికి లోనైన ఎమ్మెల్యే బలరాం.. తేజ్వానీపై దాడికి దిగారు. అడ్డుకోబోయిన తన భర్త, ఇతర మహిళలపై కూడా తవాని అనుచరులు కర్రలతో దాడికి పాల్పడ్డారు. మరుసటి రోజు నీతూ తేజ్‌వాణితో కలిసి బలరాం తవని ఏకంగా ప్రెస్‌మీట్ పెట్టారు. యువతితో రాఖీ కట్టించుకున్నారు. కేవలం అవగాహన లోపం వల్లే ఈ ఘటన జరిగిందని వివరణ ఇచ్చారు.

 

 

తాజాగా బలరాం తారనీకి కరోనా సోకింది. బలరాం గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో అతడికి సోమవారం రోజున పరీక్షలు చేయగా.. కరోనా పాజిటివ్ అని తేలింది.  బలరాంతో కలుపుకుని గుజరాత్ లో కరోనా సోకిన ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు చేరింది.  ఈ విషయాన్ని బీజేపీ అధికార ప్రతినిధి భరత్ పాండ్య వెల్లడించారు. ఇక  రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17000కు చేరింది. వీరిలో పది వేల మందికి పైగా కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7వేల కరోనా యాక్టీవ్ కేసులున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: