ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కి కారణమైన చైనా దూకుడుకి మోడీ తనదైన శైలిలో మెల్ల మెల్లగా చెక్ పెడుతూ వస్తున్నారు. మొన్నటికి మొన్న భారతీయ కంపెనీలను ఇష్టారాజ్యంగా కొనుగోలు చేయకుండా అడ్డుకట్ట వేసింది. భారతీయ కంపెనీలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేయడం అందరికీ తెలిసిందే. ఈ నిర్ణయం వల్ల ఇండియా కంపెనీలో చైనా వాటా దక్కించుకోకుండా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఇదిలా ఉండగా తాజాగా చైనా కు చుక్కలు చూపించే కొత్త రూల్ మోడీ ప్రవేశ పెట్టినట్లు సమాచారం.

 

విదేశాల నుండి ఇండియాలో దిగుమతులు అయ్యే వస్తువులను నియంత్రిస్తూ దేశీయంగా తయారీ రంగానికి మంచి చేసే విధంగా మోడీ ప్రభుత్వం తాజాగా అడుగులు వేయబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు చైనా దేశం నుండి ఎక్కువగా ఇండియాలో దిగుమతి అవుతున్న తరుణంలో వాటికి చెక్ పెట్టి ఇండియాలోనే ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కువగా తయారు అయ్యేలా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు సమాచారం. ప్రపంచం లో ఎక్కడా లేని మార్కెట్ ఇండియా లో ఉండటంతో ఇతర దేశాలకు చెందిన వాళ్లు తాము తయారు చేసిన వస్తువులను ఇండియాలో దిగుమతి చేసి అనేక లాభాలు పొందుతున్నారు.

 

ఇటువంటి తరుణంలో విదేశీ మార్కెట్ కి చెక్ పెట్టి ఇండియాలోనే తయారీ విభాగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆ  లాభం ఏదో దేశానికి వస్తే ఆర్ధికరంగం పరుగులు పెడుతోందని కేంద్రంలో ఉన్న నాయకులు అనుకుంటున్నారట. దీంతో జపాన్, తైవాన్ అదేవిధంగా చైనా దేశాల నుండి ఎక్కువగా వస్తువులు ఇండియాలో దిగుమతి అవటంతో వాటికి చెక్ పెట్టడానికి నియంత్రించడానికి మోడీ సర్కార్ నిర్ణయాలు తీసుకో బోతున్నట్లు సమాచారం. మొత్తం మీద మోడీ తీసుకు రాబోతున్న ఈ కొత్త నిబంధనలతో చైనా మార్కెట్ ఇండియాలో త్వరలోనే గల్లంతయ్యే చాన్స్ ఉందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: