రెండు రాష్ట్రాలను(మహారాష్ట్ర, గుజరాత్) భయపెట్టిన నిసర్గ తుఫాన్  తీరాన్ని తాకింది. తీరంలో నిసర్గ తుఫాన్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. వేగంగా దూసుకొస్తూ ముంబై వాసుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే కరోనాతో అల్లాడుతున్న ముంబైకర్స్.. ఈ తుఫాన్ భయంతో మరింత ఆందోళన చెందుతున్నారు.  మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ వాసుల‌ను తీవ్రంగా భ‌య‌పెడుతున్న నిస‌ర్గ తుఫాన్ తీరం దాటింది. బుధ‌వారం మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ముంబై స‌మీపంలోని అలీబాగ్ ప్రాంతంలో తుఫాన్ తీరం దాటింది. దీంతో అరేబియా స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా మారింది. అక్క‌డ కొన్ని వంద‌ల కిలోమీట‌ర్ల వేగంతో భారీ గాలులు వీస్తున్నాయి. దీంతోపాటు ముంబై స‌ముద్ర తీరంలోనూ వాతావ‌ర‌ణం భ‌యాన‌కంగా మారింది.

IHG

తుపాను ముంబైకి సమీపంలో ఉన్న అలీబాగ్ వద్ద తీరం దాటింది. తీరం దాటుతున్న సమయంలో గాలి వేగం గంటకు 120 కిలోమీటర్ల వేగంగా ఉంది. తుపాను పూర్తిగా తీరం దాటడానికి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిసర్గ ప్రభావంతో తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. మహారాష్ట్రలోని అన్ని బీచ్ లలో సెక్షన్ 144 ప్రకటించారు. తీరం దాటిన మూడు గంటల్లోగా తుపాను ముంబై, థానే జిల్లాలోకి ప్రవేశించనుంది.

IHG

మరోవైపు ఇప్పటికే కరోనాతో అల్లకల్లోలంగా మారిన మహారాష్ట్రకు ఈ తుపాను పెను విపత్తుగా పరిణమించనుంది. ఐతేన ఈ తుఫాన్ ప్రభావం కరోనా ఆస్పత్రులపైనా పడింది.  వాతావరణశాఖ హెచ్చరిక నేపథ్యంలో బంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని MMRDA సెంటర్‌ను ఖాళీ చేయించారు.

IHG

అక్కడి నుంచి 150-200 మంది కరోనా పేషెంట్లను వర్లీలోని NSCIకి తరలించారు. తుఫాన్ ప్ర‌భావం గుజ‌రాత్‌పై కూడా తీవ్రంగానే ఉండ‌డంతో అక్క‌డ కూడా స‌హాయ చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. స‌ముద్ర తీర ప్రాంతాల్లో ఉండే ప్ర‌జ‌ల‌ను ఇప్ప‌టికే సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: