తెలంగాణలో మొన్నటి వరకు గ్రీన్ జోన్ గా యాద్రాద్రి జిల్లా ఉంది. అయితే ఇటీవల ముంబాయి నుంచి వలస కార్మికులు రావడంతో భువనగిరిలో కరోనా కేసులు నమోదు అయ్యాయి.  ఆ తర్వాత ఒకటీ రెండు కేసులు ఇక్కడ కూడా మొదలు కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. తాజాగా  యాదాద్రి జిల్లాలో తొలి కరోనా మరణంనమోదైంది. జిల్లా రాజాపేట మండలం దూదివెంకటాపురం గ్రామంలో వైరస్‌ అంటుకుని ఓ బాలింత మృత్యువాత పడింది. వివరాలు..  గ్రామానికి చెందిన ఎర్రోళ్ల నాగరాజు భార్య సంతోష (23)కు ఒక్కటిన్నర సంవత్సరాల కుమార్తె ఉంది. ఆమె మరోసారి గర్భం దాల్చడంతో పరీక్షలు నిర్వహించారు. ఆమె బలహీణంగా ఉందని.. రక్తం చాలా తక్కువగా ఉందని చెప్పారు డాక్టర్లు.దాంతో జనగామ జిల్లా బచ్చన్నపేటలోని తన తల్లిగారింటికి వెళ్లింది.

 

గత నెల 28న జనగామలోని ఎంసీహెచ్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయగా ఉస్మానియా ఆస్పత్రికి రెఫర్‌ చేశారు.  తిరిగి రాజాపేట ప్రభుత్వ అస్పత్రికి రావడంతో వైద్యులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. దీంతో సంతోష తిరిగి జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ కూడా సంతోషను ఉస్మానియాకు రెఫర్‌ చేయడంతో 29న హన్మకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. వివిధ ఆసుపత్రులు తిరగడం.. అప్పటికే సంతోష పరిస్థితి అందోళనకరంగా ఉండటంతో వైద్యులు రక్తం ఎక్కించి 31న ఉస్మానియాకు పంపించారు. రాత్రి అక్కడ పండంటి మగ శిశువుకు జన్మనిచ్చి సంతోష కన్నుమూసింది.

 

కాగా, అక్కడి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. ఇక  సంతోష భర్త నాగరాజు, కుటుంబ సభ్యులు మామ ఎర్రోళ్ల మాతయ్య, భార్య మైసమ్మ, రెండో కుమారుడు కర్ణాకర్, భార్య హారిక, సంతోష కుమార్తె హేమశ్రీ, ఇంటి పక్కనే ఉంటున్న మాతయ్య సోదరుడు వెంకటయ్య, భార్యతోపాటు సంతోష తల్లితో కలిపి 9 మందిని అధికారులు బీబీనగర్‌ ఏయిమ్స్‌కు తరలించారు.  కాగా మరో 20 మందిని సెకండరీ కాంటాక్టులుగా గుర్తించినట్లు తెలిపారు.  ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తుల్లో టెన్షన్ మొదలైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: