కరోనా వైరస్ విజృంభణ వల్ల అమెరికా, చైనా దేశాల మధ్య దూరం అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా చైనాపై ఆరోపణలు చేయడం... చైనా, అమెరికాపై విమర్శలు చేయడం జరుగుతోంది. ఈ వివాదం అంతకంతకూ ముదురుతోంది. ప్రస్తుతం అమెరికా చైనా ఆర్థిక వ్యవస్థను కకావికలం చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. చైనా ప్రపంచ స్థాయి ఆధిపత్యం చలాయించటానికి ప్రయత్నాలు చేస్తూ ఉండటంతో అమెరికా చైనాను దెబ్బ తీయడానికి ప్రయత్నాలు చేస్తోంది. 
 
చైనా కొన్ని దేశాలకు అప్పులు ఇచ్చి ఆ దేశంలోని భూభాగాలను హస్తగతం చేసుకొని సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తోంది. ఈ సైనిక స్థావరాల ఏర్పాటు ద్వారా తన శక్తిని ప్రదర్శించాలని చైనా భావిస్తోంది. మ్యానుఫాక్టరింగ్ సెక్టార్ లను ఇతర దేశాలలో ఏర్పాటు చేసి అక్కడ ఉపాధి అవకాశాలను పెంచడమే కాక ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుందామని చైనా భావిస్తోంది. చైనా ఆధిపత్యంలోకి ఇతర దేశాలు వెళ్లకూడదని... మ్యానుఫాక్టరింగ్ సెక్టార్లు అమెరికాలో ఏర్పాటు కావాలని ట్రంప్ భావిస్తున్నారు. 
 
ఇప్పటికే కరోనా విషయంలో చైనా వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న అమెరికా పపంచ దేశాల ముందు చైనాను దోషిగా నిలబెట్టింది. అమెరికా చైనా వ్యాఖ్యల వల్ల చైనా నుంచి పెద్దఎత్తున ఇతర దేశాలకు వ్యాపారసంస్థలు తరలిపోతున్నాయి. అమెరికాలో యాంటిఫా అనే సంస్థ ప్రస్తుతం జార్జి ఫ్లాయిడ్‌ను అత్యంత కిరాతకంగా పొట్టనబెట్టుకున్న జాత్యహంకార పోలీస్‌ అధికారి దుశ్చర్యపై నిరసన వ్యక్తం చేస్తోంది. 
 
నిరసనలు, ఆందోళనలు, కర్ఫ్యూలు, నిర్బంధాలతో అమెరికా అట్టుడుకుతోంది. అయితే వీటి వెనుక చైనా ఉందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చైనా యాంటఫా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని అమెరికాను దెబ్బ కొట్టేలా చైనా భారీ కుట్రకు పాల్పడుతోందని చర్చ నడుస్తోంది. అమెరికాపై పగ, ప్రతీకారాలు తీర్చుకోవడమే లక్ష్యంగా చైనా ప్రయత్నాలు చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.     

మరింత సమాచారం తెలుసుకోండి: