ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రపంచంలో జరిగి చిత్ర విచిత్రాలన్నీ మన కళ్లు ముందు ఆవిష్కరింపబడుతున్నాయి.  మనుషులు, జంతువులు, పక్షులు ఒక్కటేమిటి ప్రపంచంలో విడ్డూరంగా జరుగుతున్న ప్రతి ఒక్కటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక కోతులకు మనుషులకు మంచి దగ్గర పోలికలు ఉంటాయంటారు.. కోతి నుంచే మనిషిగా పరిణామం చెందాన్నమన్న విషయం తెలిసిందే.  అందుకే మనుషులను కోతులు బాగా అనుకరిస్తుంటాయి.  ఆ మద్య ఓ కోతి డ్రైవింగ్ చేసిన విషయం తెలిసిందే.. ఇటీవల కోన్ని కోతులు మనుషుల మద్య తెగ హడావుడి చేస్తున్నాయి.  కరోనా వచ్చినప్పటి నుంచి చాలా జంతువులు ఆకలి కోసం అలమటించిపోయాయి.. అందులో కోతులు కూడా ఉన్నాయి.

 

తాజాగా ఓ కోతి చేసిన పని చూస్తే నిజంగా ఈ మాత్రం క్రమశిక్షణ మనకు ఉంటే ఎంత బాగుండూ.. అనకుంటున్నారు నెటిజన్లు.  ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో బాధింపబడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇది మన దేశంలో కూడా పెను విషాదాలు సృష్టిస్తుంది.  కరోనా నుంచి రక్షించుకోవడానికి సోషల్ డిస్టెన్స్, మాస్క్ ధరించి బయటకు రావడం.. విలైనంత వరకు శానిటైజర్ ని వాడటం చేస్తున్నాం.  అయితే బయటకు వెళ్తే తమ పెంపుడు జంతువు ల విషయంలోనూ ఎంతో జాగ్రత్తలు పడుతున్నారు.  తాజాగా ప్రసార, ముద్రణ మీడియాలో 18 ఏండ్ల అనుభవజ్ఞుడైన జర్నలిస్ట్‌ సౌరవ్ సన్యాల్ ఓ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశాడు.

 

ఇందులో ఓ కోతి బస్సులో కూర్చొని ప్రయాణిస్తుంది. పక్కనే ఒక మహిళ మాస్క్‌ ధరించి ఉండగా ఆమె వైపు తదేకంగా చూస్తూ ప్రయాణించింది కోతి. ఇక సీటులో కూర్చున్న కోతి రెండు చేతులు, కాళ్లతో ముందున్న సీటుని గట్టిగా పట్టుకున్నది. ఈ కోతి ప్రయాణం ఎక్కడికో.. దీని యజమాని ఎవరో గాని బస్సులో ఎంత బుద్ధిగా కూర్చొన్నదో చూడండి.. మనం బస్సు ఎక్కితే చాలా హడావుడి.. సీటు కోసం పోటీ పడటం చేస్తుంటాం. ఇప్పుడు కరోనా వైరస్ బాదతో సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్న విషయం తెలిసిందే. 39 సెకండ్లపాటు నడిచే ఈ వీడియోను వేలమంది వీక్షించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: