ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తుంది ప్రాణాంతకమైన మహమ్మారి కరోనా వైరస్.. మొదట చైనాలో వుహాన్  నగరం లో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మహమ్మారి వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి చైనా పై ప్రపంచ దేశాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. ఈ మహమ్మారి వైరస్ ఇంత ప్రమాదకరమైంది అని ప్రపంచదేశాలను చైనా ముందుగా అప్రమత్తం చేయలేదు అని... అంతేకాకుండా ఈ మహమ్మారి వైరస్ కి సంబంధించి చైనా ముందుగా వ్యాక్సిన్  కనుగొన్న తర్వాతనే ఈ వైరస్ వ్యాప్తి చెందేలా చేసింది అని ప్రస్తుతం చైనాపై విమర్శలు  వస్తున్నాయి. అయితే చైనా ప్రభుత్వం పై ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం చైనాకు వత్తాసు  పలుకుతు వచ్చిన విషయం తెలిసిందే. 

 


 ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఇచ్చే నిధులను సైతం నిలిపివేశారు అమెరికా అధ్యక్షుడు. అయితే అటు  అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు చైనా కు వెళ్ళి పరిశోధనలు చేసేందుకు అనుమతించలేదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ప్రతి విషయంలో చైనా ప్రభుత్వాన్ని వెనకేసుకునే వస్తుంది. ఈ వైరస్ నేపథ్యంలో చైనాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తూ వచ్చింది ఇప్పటివరకు. 

 


 తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా గురించి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ కి ఇచ్చినటువంటి... ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెబుతూ వచ్చింది. చైనా ప్రభుత్వం ముందుగా కరోనా  వైరస్ కు సంబంధించినటువంటి జన్యు  వర్గీకరణ చేసినప్పటికీ కూడా.. బయట మాత్రం పెట్టలేదు అన్నది తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే ఈ  మహమ్మారి వైరస్ కు సంబంధించిన మూలాలు తెలిసి కూడా చైనా ప్రభుత్వం బయట పెట్టలేదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పరోక్షంగా ఒప్పుకొంది. కానీ ఇదే విషయాన్ని లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వడానికి మాత్రం ఒప్పుకోలేదు ప్రపంచ ఆరోగ్య సంస్థ.మరి  రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి నిజాలు బయటకు వస్తాయి అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: