జనాలను అయోమయంలో ముంచెత్తడానికి ఎప్పుడూ ఏదో ఒక  న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతు  ఉంటుందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ఇలాంటి  న్యూస్ లు  మరింతగా సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. ఏదో ఒక విషయంలో  న్యూస్ వస్తూ అది జనాలను అయోమయంలో పడేస్తోంది. గత కొన్ని రోజుల నుంచి శానిటైజర్ ల గురించి ఒక న్యూస్  సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం కారణంగా శానిటైజర్ ల వాడకం ఒక రేంజ్ లో పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ శానిటైజర్ ఎక్కువగా వాడుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల శానిటైజర్ ల కొరత కూడా ఏర్పడుతుంది. 

 


 అయితే ప్రస్తుతం ఏకంగా శానిటైజర్ ల గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.ఇందులో  కొన్ని నిజాలు ఉంటే కొన్ని అబద్దాలు  ఉన్నాయి. ఇక ఇందులో నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకోడానికి మాత్రం నెటిజన్లు తెగ ఇబ్బంది పడిపోతున్నారు. ఇక ఇటీవలే  శానిటైజర్ లపై ఓ వార్త  హల్ చల్ చేస్తోంది. 50 నుంచి 60 రోజులు హ్యాండ్ శానిటైజర్ వాడితే ప్రమాదకర చర్మ వ్యాధులు వస్తాయని క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇంకేముంది ఈ వార్తను చూసిన నెటిజన్లు అందరికీ షేర్ చేస్తున్నారు. ఇక చివరికి ఈ వార్త అటు తిరిగి ఇటు తిరిగి ఏకంగా కేంద్ర ఆరోగ్య శాఖ వద్దకు చేరింది. 

 


 దీంతో వెంటనే నిపుణులను పిలిపించి ఇందులో నిజం ఎంత అనేది నిగ్గు  తేల్చారు. అయితే ఈ వార్తల్లో  కనీసం ఒక్క శాతం కూడా నిజం లేదు అన్నది నిపుణులు తేల్చారు. హ్యాండ్ శానిటైజర్ లు అనేది మనుషులకు ఎప్పుడూ హాని చేయవని... హ్యాండ్ శానిటైజర్ లలో  ఆల్కహాల్ శాతం కనీసం 70 శాతం కంటే తక్కువగా ఉండేలా చూసుకుంటే... అది ఎలాంటి క్రీములతో ఆయన చక్కగా పోరాడ  కలుగుతుంది అంటూ చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా వేదికగా వచ్చే వార్తలను నమ్మి అయోమయంలో పడవద్దు అంటూ దేశ ప్రజానీకానికి సూచించింది కేంద్ర ఆరోగ్య శాఖ. కొన్ని వార్తల పట్ల జాగ్రత్తగా ఉండాలి అంటూ సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: