కొందరు మనుషులు జంతువులకంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. జూలోకి చొరబడిన ఓ మనిషి తన మానాన తాను తింటున్న ఎలుగును కవ్వించాడు. అది కాస్తా వెంటపడేసరికి నీటిలో దూకాడు. అది కూడా నీటిలోకి దూకండంతో దాని మెడపట్టుకుని ముంచేసి చంపేయబోయాడు.  ఈ మద్య ప్రపంచంలో కరోనా మహమ్మారి వల్ల మనుషులు ఉన్మాదంతో పిచ్చెక్కిపోతున్నారు. మనుషులనే కాదు అమాయకమైన జంతువులను హింసిస్తూ.. పైశాచిక ఆనందం పొందుతున్నారు.   కేర‌ళ రాష్ట్రం మ‌ల‌ప్పురం జిల్లాలో ‌పైనాపిల్ బాంబు పేలి ఏనుగు మృతి చెందింది.  మ‌ల‌ప్పురం లో గర్భంతో ఉన్న ఎనుగుకు కొంత మంది కృరమృగాళ్ళు పైనాపిల్ లో పటాసులు పెట్టి తినిపించారు. అది తిన్న ఏనుగు పటాసులు నోట్లో పేలి నరకం అనుభవించింది.. తినే వీలు లేక బాధపడింది.. మంటతో ఇబ్బంది పడుతూ నీటిలోకి వెళ్లి అక్కడే అవస్థలు తీస్తూ చనిపోయింది.  

 

ఇక్కడ గ‌తంలో రోడ్ల‌పై విషం చ‌ల్లి మూడు, నాలుగు వంద‌ల ప‌క్షులు, కుక్క‌లను చంపారు. ఏనుగు మ‌ర‌ణానికి కార‌ణ‌మైన వారిపై కేర‌ళ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.  పోలాండ్ జూలోకి చొరబడిన ఓ మనిషి తన మానాన తాను తింటున్న ఎలుగును రెచ్చగొట్టాడు. అది కాస్తా వెంటపడేసరికి నీటిలో దూకాడు. అది కూడా నీటిలోకి దూకండంతో దాని మెడపట్టుకుని ముంచేసి చంపేయబోయాడు.  పోలండ్‌లోని వార్సా జూలో గత నెల 26న ఈ సంఘటన చోటుచేసుకుంది. 23 ఏళ్ల యువకుడు మద్యం మత్తులో ఎలుగుబంట్ల ఎన్‌క్లోజర్లోకి చొరబడ్డాడు. సబ్రినా అనే ముసలి ఆడ ఎలుగు చెంతకు వెళ్లాడు.

 

గతంలో ఆ ఎలుగు  సర్కస్‌లో పనిచేసింది. ఎలుగు అతణ్ని వాలకం చూసి సరదాగా వెంటపడింది. దాన్ని చూసి కందకంలో దూకాడు. అది కూడా దూకేసింది. వాడు ఎలుగు పట్టు నుంచి తప్పించుకుని దాని చెవులు మెలిపెట్టి, వీపుపై కూర్చున్నాడు. దాన్ని తొక్కిపెట్టి చంపేయడానికి యత్నించాడు. వయసులో ఉన్న మగ ఎలుగుబంటి చేతికి చిక్కింటే కథ మరోలా ఉండేదన్నారు. పోలీసులు అతణ్ని అరెస్ట్ చేసి జరిమానా వడ్డించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: