ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి బాగా పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ ని అరికట్టేందుకు విశ్వప్రయత్నం చేస్తున్న కూడా అదుపులోకి వచ్చే విధంగా కనపడటం లేదు. ఇక కరోనా మహమ్మారి లక్షణాల గురించి మరో షాకింగ్ విషయం బయటకు రావడం జరిగింది. ఇప్పటివరకు కారణాల క్షణాల్లో జ్వరం, పొడి దగ్గు, జలుబు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు... ఉండగా మొత్తం 14 లక్షణాలు కరోనా వ్యాధికి కారణం అవుతుంది అని తెలియజేయడం జరిగింది.


తాజాగా ఇక ICMR జనవరి 22 నుంచి ఏప్రిల్ 30 వరకు నమోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య పై అధ్యయనం చేయడం జరిగింది. ఈ అధ్యయనంలో వైరస్ ఒక దానికి గల ముఖ్య కారణాలు లక్షణాలు ఏమిటి అన్న విషయాన్ని పై పరిశీలన చేయడం జరిగింది. కొన్ని కేసులు అయితే లక్షణాలు లేకుండా కూడా పాజిటివ్ అని నిర్ధారణ రావడంతో, మిగతా వాటిలో సుమారు 14 లక్షణాల కారణంగా మృతి చెందిందని ICMR ఓ అధ్యయనంలో తెలియజేయడం జరిగింది. ఆ కంపెనీ అధ్యయనం చేసిన భాగంలో కేసులలో సుమారు 64.5 శాతం కేసులు తప్పు ప్రధాన లక్షణంగా ఉండగా... 60 శాతం కేసులు జ్వరంతో.. 31.9 శాతం శ్వాసకోశ కారణంతో... 26.7 గొంతులో గరగర వల్ల కేసులు నమోదు అయినట్లు ఐసీఎంఆర్ తెలియజేయడం జరిగింది.


ఇక అలాగే కండరాల నొప్పి వల్ల కూడా 12.5 శాతం పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు అర్థమవుతుంది. ఈ లక్షణాలతోపాటు ముక్కు నుంచి నీరు కారడం, వాంతులు, కడుపు నొప్పి ఇలాంటి లక్షణాలు ఉన్నవారికి చెందినట్లు ఐసీఎంఆర్ స్పష్టంగా తెలియజేశారు. ఇక దేశంలో సాధారణ ప్రజల కంటే వైద్య సిబ్బంది కరోనా వ్యాప్తి చెందే ఛాన్సులు ఎక్కువగా ఉన్నట్లు ఐసీఎంఆర్ తెలియజేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: