ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా  వైరస్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు అతి తక్కువగా నమోదైన కేసులు  ప్రస్తుతం లాక్ డౌన్ సడలింపులు  ఇచ్చినప్పటినుంచి భారీగా పెరిగిపోతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా భారీ గా కేసులు నమోదవుతున్నాయి. అటు ప్రభుత్వం కూడా కరోనా  వైరస్ ను కంట్రోల్ చేసేందుకు ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపడుతోంది. ఇదే సమయంలో వలస కార్మికుల రాకపోకలు కూడా జరుగుతుండటం... ఎక్కువ మొత్తంలో ప్రజలు బయట తిరుగుతుండటంతో  .. మహమ్మారి వైరస్ వ్యాప్తి మరింతగా పెరిగిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో. రోజు రోజుకు నమోదవుతున్న కరోనా  కేసులు మళ్లీ ఆందోళనకర పరిస్థితులకు దారితీస్తుంది. 

 

 ఇదిలా ఉంటే తాజాగా జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కు చెందిన పరిశోధకులు కరోనా  వైరస్ గురించి సంచలన నిజాలు బయట పెట్టారు. అక్కడి పరిశోధకులు తాజాగా జరిపిన అధ్యయనంలో  తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒక రకమైన వైరస్ కాదు ఏకంగా 55 రకాలుగా కరోనా వైరస్ రూపాంతరం చెంది వ్యాప్తి చెందింది అని నిర్ధారించారు. యూరోప్ చైనా దేశాల నుంచి వచ్చిన కరోనా  వైరస్ రూపాంతరం చెంది ఇలా భారతదేశంలో ఎన్నో రకాలుగా మారిందని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కు చెందిన పరిశోధకులు వెల్లడించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ ప్రజానీకం కాస్త భయాందోళనకు గురి అవుతుంది అనే చెప్పాలి. 

 


 అయితే తెలంగాణ రాష్ట్రంలో చైనా నుంచి రూపాంతరం చెందిన కరోనా  వైరస్ 55 రకాల కరోనా  వైరస్ గా రూపాంతరం చెందింది అని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే మొత్తంగా భారతదేశంలో 198 రకాలుగా  కరోనా  వైరస్ రూపాంతరం చెందింది అని  సంచలన విషయాలను వెల్లడించారు. ఇందులో అత్యధిక రకాలుగా  రూపాంతరం చెందిన ప్రాంతాలలో  తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానంలో ఉంది. అహ్మదాబాద్ లో  ఏకంగా 60 రకాలుగా కరోనా  వైరస్ రూపాంతరం చెందినట్టు ఈ అధ్యయనంలో వెల్లడైంది. తాజా అధ్యయనంలో వెల్లడైన నిజం తో ప్రస్తుతం అందరిలో భయాందోళన మరింత పెరిగిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: