గత కొన్ని రోజుల నుంచి భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. చైనా కావాలని భారత సైనికులను  రెచ్చగొట్టి కయ్యానికి కాలుదువ్వినట్లుగా చేస్తోంది. భారత సరిహద్దుల్లో కి ప్రవేశించడానికి చైనా సైనికులు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ఏకంగా చైనా సైనికులు భారత సైనికుల పై రాళ్లతో దాడికి కూడా దిగుతున్నారు. ఇలా ఏ క్షణాన భారత్-చైనా మధ్య యుద్ధం జరుగుతుందో అనేటువంటి వాతావరణం ప్రస్తుతం చైనా భారత్ సరిహద్దులో నెలకొంది. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు అమెరికా సరిహద్దు వివాదం విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తాను  అంటూ అమెరికా  తెలిపిన విషయం తెలిసిందే. కానీ భారత్ చైనా మాత్రం మధ్యవర్తిత్వం అవసరం లేదు అంటూ తేల్చి చెప్పాయి. 

 


 ఇక తాజాగా అమెరికా ప్రత్యక్షంగా చైనా కు వార్నింగ్ ఇచ్చింది. అది కూడా భారతరత్ తరుపున  చైనా కు వార్నింగ్ ఇచ్చింది అమెరికా. గత కొంతకాలంగా అమెరికా ప్రభుత్వం చైనా పై తీవ్రస్థాయిలో కోపంతో ఉండడం కారణంగానా  లేదా మరేదైనా కారణం ఉందా అనే విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం పరోక్షంగా కాకుండా ఏకంగా ప్రత్యక్షంగా భారత్ తరఫున చైనా కు వార్నింగ్ ఇచ్చింది అమెరికా. ఉద్రిక్త పరిస్థితులను ప్రస్తుతం మీరు సరిహద్దుల్లో సృష్టిస్తున్నారు.. భారత సరిహద్దుల్లో సుదీర్ఘకాలం పాటు ఎందుకు సైన్యాన్ని మోహరిస్తున్నారు... ఎలాంటి వివాదం లేనటువంటి భూభాగాల్లో ఎందుకు వివాదాలను సృష్టిస్తున్నారు.. అని ప్రస్తుతం చైనా కి అమెరికా కి సంబంధించిన ఉన్నతాధికారులు ప్రశ్నించారు. 

 


 ఇలా చైనాను నేరుగా ప్రశ్నిస్తూ.. ఎందుకు ఇలాంటి వివాదాస్పద వ్యవహారాన్ని భారత సరిహద్దుల్లో నడుపుతున్నారు అటువంటిది.. ప్రస్తుతం అమెరికా ప్రశ్నించింది. కేవలం నియంతృత్వ ప్రభుత్వాలు.. ఇలాంటి చర్యలకు పాల్పడుతాయి  అన్నటువంటి అమెరికా విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించారు. చైనా ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు సరైనవి కావు అంటూ తెలిపారు. చైనా సరిహద్దుల్లో సైన్యం మోహరించడం సబబు కాదు అని తెలిపింది. ఇలా భారత్-చైనా సరిహద్దు వివాదంలో అమెరికా ప్రత్యక్షంగా చైనాను ప్రశ్నించడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అమెరికా ఇలా ప్రశ్నించడం ద్వారా చైనా సరిహద్దుల్లో అతి  చేస్తుంది అన్నది  ప్రపంచానికి తెలిసేలా చేసినట్లు అవుతుందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: