తెలుగు చిత్ర పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ కి ఎంత గొప్ప క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ ఆయనకు మాత్రం ఒక ప్రత్యేక ఇమేజ్ ఉంటుంది. నందమూరి అసలుసిసలైన నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకుని తాతకు తగ్గ మనవడిగా నిరూపించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు ఎలాంటి కాంట్రవర్సీ లలోకి వెళ్ళ లేదు అన్న విషయం తెలిసిందే. అటు జూనియర్ ఎన్టీఆర్ కు రాజకీయాలతో సంబంధం ఉన్నప్పటికీ  ఎక్కడ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దాఖలాలు మాత్రం కనిపించవు. జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలిసిన వాళ్ళు అందరూ ఆయనది  గొప్ప వ్యక్తిత్వం అని.. అందరితో కలివిడిగా ఉంటారు అని చెబుతూ ఉంటారు. 

 


 ప్రతి విషయంలో ఎంతో హుందా తనం తో ఉండే జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి కాంట్రావర్సీలు  దరిచేరకుండా ఎప్పుడు సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటాడు. కానీ ప్రస్తుతం అభిమానులు చేసిన పనికి ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ కి మచ్చ  వచ్చే పరిస్థితి ఏర్పడింది. జూనియర్ ఎన్టీఆర్ కి అభిమానులు కూడా చాలామంది ఉన్నారు అన్న విషయం తెలిసింది. వీరిలో కొంతమంది అతిగా అభిమానించే వాళ్ళు... ప్రస్తుతం సోషల్ మీడియా లో సంచలనాలు సృష్టిస్తున్నారు. ఏకంగా ఒక హీరోయిన్ పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 


 మీరా చోప్రా హీరోయిన్ ఒకానొక  సమయంలో తనకు ఎన్టీఆర్ కంటే మహేష్ బాబు ఎక్కువ ఇష్టం అని చెప్పిన దానికి.. జూనియర్ ఎన్టీఆర్ ని అతిగా అభిమానించేవారు.. ఆమె పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే  తనను పోర్న్ స్టార్  అంటున్నారని... అంతే కాకుండా తన తల్లిదండ్రులు చావాలని కోరుకుంటున్నారు అంటూ మీరాచోప్రా ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఇలాంటి అభిమానులతో మీరు ఎంతగానో ఎదిగాను అని అనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు  మీరా చోప్రా. అయితే దీనిపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించి ఈ వివాదానికి సద్దుమణిగేలా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు విశ్లేషకులు

మరింత సమాచారం తెలుసుకోండి: