రెండు తెలుగు రాష్ట్రాల్లో బలమైన పార్టీగా తయారవ్వడమే  కాకుండా వచ్చే ఎన్నికలనాటికి  అధికారం చేజిక్కించుకోవాలని కేంద్ర అధికార పార్టీ బిజెపి ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో ఇప్పటికే ఎంపీ బండి సంజయ్ ని అధ్యక్షుడిగా నియమించింది. ఆయన బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి పార్టీని పరుగులు పెట్టించే విధంగా అడుగులు వేస్తుండగా, ఏపీలోనూ అదే తరహాలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించే విధంగా ప్లాన్  బీజేపీ అగ్ర నాయకులు ప్లాన్ చేసుకుంటున్నారు. మొదటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజెపికి పట్టు తక్కువగానే ఉంటూ వస్తోంది. మొన్నటి ఎన్నికల్లో తెలంగాణలో బిజెపికి వచ్చిన కొద్దిపాటి సీట్లు మాత్రమే అయినా ఆ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని కలిగించింది. 


తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడటంతో అక్కడ వచ్చే ఎన్నికల నాటికి టిఆర్ఎస్ కు దీటైన పార్టీగా బీజేపీ బలపడుతుందనే నమ్మకం ఆ పార్టీ అగ్రనేతల్లో సైతం కనిపిస్తోంది. ఇక ఏపీ లోనూ వచ్చే ఎన్నికల నాటికి బలం పుంజుకోవాలని బీజేపీ చూస్తోంది. దీని కోసం అవసరమైతే సమూల మార్పులు చేపట్టేందుకు కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు సిద్ధమవుతోంది. దీంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో హిందూ అజెండాను తెరమీదకు తీసుకు రావాలని చూస్తోంది. ఇప్పటికే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అటు టిఆర్ఎస్, ఏపీలో వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు మొదలుపెట్టారు.


 ఏపీలో క్రైస్తవ రాజ్యం, తెలంగాణలో ముస్లిం రాజ్యం స్థాపించే దిశగా జగన్ కేసీఆర్ పనిచేస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. దీని ద్వారా హిందువుల్లో రెండు రాష్ట్రాల అధికార పార్టీలపై వ్యతిరేకత పెంచే విధంగా చేయాలనే ఆలోచనతో బండి సంజయ్ ఆ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా ఇవే అంశాలను తెర మీదకు తీసుకువచ్చి బిజెపి బలపడేలా చూడాలన్నదే బీజేపీ కేంద్ర నాయకత్వం ఆలోచనగా తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: