తెలంగాణలో గత కొద్దీ రోజుల నుండి కరోనా కేసుల సంఖ్య మాత్రమే కాదు కరోనా మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. నిన్న కరోనా వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 7గురు మరణించారు దాంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 99కు చేరింది. నేటి తో సెంచరీ  కంప్లీట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక నిన్న ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 129 పాజిటివ్ కేసులు నమోదయ్యాయనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈకొత్త కేసుల తో కలిపి ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 3020కు చేరింది అందులో1556మంది బాధితులు కోలుకోగా ప్రస్తుతం1365 కేసులు యాక్టీవ్ గా వున్నాయి.
ఇక దేశ వ్యాప్తంగా భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్క రోజే దేశం లో 9500కేసులు బయటపడ్డాయి. సింగిల్ డే లో ఇప్పటివరకు ఇదే రికార్డు. వీటిలో అత్యధికంగా మహారాష్ట్రలో 2560, తమిళనాడులో 1286, ఢిల్లీలో 1513, గుజరాత్ లో 485 కేసులు నమోదయ్యాయి. కాగా దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 217000 దాటగా 6000కు పైగా మరణాలు చోటు చేసుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ ప్రస్తుతం 7వస్థానం లో కొనసాగుతుంది. మరోవైపు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ 5 అమలులోకి వచ్చింది అయితే ఈలాక్ డౌన్ ను కేవలం కంటైన్మెంట్ జోన్లకే పరిమితం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: