ఏదైనా మనసుంటే మార్గం ఉంటుందని ఏపీ సీఎం జగన్ మరోసారి నిరూపించాడు. తాను అనుకున్నది చేసి చూపిస్తానని చెబుతున్నాడు. ఇప్పుడు ప్రపంచమంతా ప్రైవేటీకరణ సాగుతోంది. ప్రభుత్వాలు కీలక బాధ్యతల నుంచి కూడా తప్పుకుని ప్రైవేటుకు అప్పగించేస్తున్నాయి. విద్య, ఆరోగ్యం, రక్షణ ఇలా అన్ని కీలక విభాగాల్లోనూ ప్రైవేటు మంత్రమే నడుస్తోంది. ఇక విద్య సంగతి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

 

IHG

 

నారాయణ, చైతన్య వంటి పాఠశాలలు వచ్చాక ఈ ప్రైవేటు పాఠశాలల జోరు పెరిగింది. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలలు రోజురోజుకూ దారుణంగా తయారవుతున్నాయి. వేలకు వేలు జీతాలు తీసుకునే ఉపాధ్యాయులు ఉన్నా.. తగిన మౌలిక సదుపాయలు ఉండనే ఉండవు. అందుకే జనం కూడా డబ్బు పోతే పోయింది పిల్లల భవిష్యత్ బావుండాలని ప్రైవేటు బడులకే పంపుతున్నారు. మరి ఆ డబ్బు లేని వారు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారు.

 

IHG

 

ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వ పాఠశాలల తలరాత మార్చేందుకు నిర్ణయించుకున్నారు. నాడు - నేడు పేరుతో ఓ కార్యక్రమం రూపొందించి వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల దశ తిరగబోతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఫర్నిచర్, సౌకర్యాలు కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా సీఎం జగన్ వాటి నమూనాలు పరిశీలించారు.

 

IHG

ఆ నమూనాల ఫోటోలు చూస్తే.. కళ్ల తిరగడం ఖాయం. అంత అద్భుతంగా ఉన్నాయి. వేలకు వేలు ఫీజులు పోసి చదివించే పాఠశాలల్లో కూడా అలాంటి సౌకర్యాలు ఉండవేమో అనిపిస్తోంది. మరి జగన్ నిజంగా ఇలాంటి ఫర్నిచల్ అన్ని ప్రభుత్వ పాఠశాలలకు అందిస్తే.. విద్యార్థుల తల్లిదండ్రుల ఆనందం అంతా ఇంతా కాదు.

 

 

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: