కరోనా మహమ్మారి భారతదేశంలో తీవ్రస్థాయిలో విజృంభించడం వల్ల దశలవారీగా విధించిన లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయింది. ప్రజలందరూ ఇళ్ళకే పరిమితం కాగా లక్షలాది మందికి ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్నారు. నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ఇటీవలే 'స్వదేశీ' నినాదం ఇచ్చిన సంగతి తెలిసిందే. పరిశ్రమకు ఇవ్వాలని మరియు విదేశీ వస్తువుల యొక్క విక్రయం తగ్గించాలని ప్రజలకు మోడీ పిలుపునిచ్చాడు. అయితే నినాదం పై మరొక కీలకమైన అడుగు వేసే దిశగా కేంద్రం సన్నాహాలు జరుపుతోంది.

 

అసలు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటికీ పరిస్థితి రావడానికి కారణం చైనా. మన దేశంలో అత్యధిక మొత్తంలో వస్తువులను, ఎలక్ట్రానిక్స్, సెల్ ఫోన్ మరియు అనేకానేక పరికరాలను దిగుమతి చేసే దేశం కూడా చైనానే. మన దేశ ఆర్థిక వ్యవస్థ చైనా పైన మీద చాలా ఆధారపడి ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. కానీ మోడీ ప్రభుత్వం ఇప్పుడు దానిని క్రమేపీ తగ్గించేయాలని చూస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 'మేక్ ఇన్ ఇండియా' ప్రవేశపెట్టింది. క్రమంలోనే అనవసర దిగుమతులను ఇతర దేశాల నుండి ముఖ్యంగా చైనా నుండి దేశంలోకి తగ్గించాలని డిసైడ్ అయిపోయింది.

 

అయితే ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల్లో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను మోడీ ప్రభుత్వం ఉల్లంఘించే అవకాశాలు కనిపించడం లేదు. అదే సమయంలో భారత్ లో నాణ్యమైన వస్తువుల ఉత్పత్తిని పెంచాలని యోచిస్తోందట.. దీంతో దిగుమతులపై దశల వారీగా నిషేధం విధించాలని యోచిస్తోంది. లేకపోతే దేశీయంగా నాణ్యమైన వస్తువుల కొరత వాటిల్లే ప్రమాదం ఏర్పడనుంది. కానీ ఒక్క విషయంలో మాత్రం కేంద్ర చాలా స్పష్టంగా ఉంది …. రాబోయే రోజుల్లో దాదాపు భారత్ లో ఉండే అన్నీ పరికరాల్లో 'మేడ్ ఇన్ ఇండియా' అని కనపడే రోజులు మాత్రం తీసుకొని రావాలని. అదే జరిగితే డ్రాగన్ కంట్రీ చైనా కి చాలా పెద్ద నష్టం అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: