భారత దేశంలోని ప్రతి ఒక్క రాష్ట్రం ఇప్పుడు కరోనా పై తీవ్రస్థాయిలో యుద్ధం చేస్తోంది. మహారాష్ట్ర, తమిళనాడు ఢిల్లీ, గుజరాత్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే మహమ్మారి దెబ్బకు కుదేలు అయిపోయి రోజుకి వందల కేసులు నమోదవుతున్నా ఏమీ చేయలేని స్థితిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రోజుకొక గుడ్ న్యూస్ వినే అవకాశం వస్తోంది.

 

మొదట్లో కరోనా నివారణ చర్యల గురించి ప్రస్తావించిన జగన్ ను చాలామంది ఎన్నో రకాలుగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే నిదానంగా ఏపీలో రోజు రోజుకి మారుతున్న పరిస్థితులను చూసి వారంతా తమ నోర్లు మూసుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే దేశంలోనే అత్యధిక కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగిన రాష్ట్రాల్లో ముందు వరుసలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మరో ఘనత సాధించింది.

 

మహమ్మారి వైరస్ పరీక్షల నిర్వహణతో పాటు రికవరీ రేటులో కూడా ఏపీ రికార్డు సృష్టించింది. తాజాగా ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన మేరకు ప్రతి రోజు 12 వేలకు పైగా పరీక్షలు నిర్వహిస్తూ దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ రోగులకు మెరుగైన సదుపాయాలు అందించడంలో కూడా మొదటి స్థానంలోనే ఉందని వెల్లడించారు.

 

ఏపీ వ్యాప్తంగా ఇప్పటివరకు 3 లక్షలకు పైగా వైరస్ నిర్ధారణ పరీక్షలు ప్రజలకు చేయడం రికార్డ్ గా మారింది. ఏపీలో 395681 పరీక్షలు జరగగా.. 391890 మందికి నెగెటివ్ గా నిర్ధారణ అయ్యినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇక వైరస్ నుంచి కోలుకున్న వారి రేటు విషయంలోనూ ఏపీ గణనీయమైన ముందడుగు వేసింది. దేశంలో వైరస్ నుంచి కోలుకున్న వారి రికవరీ రేటు 48శాతం ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా 45శఆతం ఉంది. అదే ఏపీలో ఏకంగా 69శాతం రికార్డు ఉండడం విశేషం. ప్రస్తుతం ఏపీలో 3200 పాజిటివ్ కేసులున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: