ఏపీ సీఎం జగన్ ఏడాది పాలన పూర్తి చేసుకున్నాడు. ఈ ఏడాదిలోనే అనేక పథకాలకు శ్రీకారం చుట్టాడు. తాను ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో దాదాపు 90 శాతం హామీలు అప్పుడే తీర్చేశాడని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొదటి నుంచి అంతంత మాత్రంగానే ఉంది. ఈ విషయం చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రోజూ ప్రెస్ మీట్ పెట్టి చెప్పేవారు.

 

 

రూ. 16 వేల కోట్ల రూపాయల అప్పులతో విడిపోయాం.. లోటు బడ్జెట్ తో రాష్ట్ర ప్రస్థానం ప్రారంభించాం అంటూ చంద్రబాబు ఇప్పటికీ చెబుతూనే ఉంటారు. అయితే తన ఐదేళ్ల పాలనలో చంద్రబాబు చేసింది అప్పులే అంటున్నారు వైసీపీ నేతలు. ఎందుకంటే.. గతంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులను ఇప్పుడు జగన్ సర్కారు తీర్చాల్సివస్తోందట. ఆ వివరాలను సమగ్రంగా మీడియా ముందు ఉంచారు.

 

 

ఈ సంవత్సరకాలంలో ఏపీ రాష్ట్రం ఆర్థికంగా చాలా ఒడిదొడుకుల్లో ఉంది. దీనికి కార‌ణం రాష్ట్ర విభజన ఒక్కటే కాదు.. ఐదేళ్ల చంద్రబాబు దౌర్భాగ్యపు దుబారా పాలన కూడా అంటున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసింది కాక.. మళ్లీ దాన్నే అద్భుతం అనిపించుకోవడం కోసం తనకున్న మీడియా బలాన్ని ఉపయోగించుకున్నాడని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

 

 

ఇక జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు పెట్టి పోయిన బకాయిలు వేల కోట్లలో తీర్చేశారట. ఐదేళ్లలో చంద్రబాబు పెట్టిన వేల కోట్ల రూపాయల బకాయిలను సీఎం వైయస్‌ జగన్‌ తీరుస్తున్నారట. ధాన్యం సేకరణ కోసం చంద్రబాబు పెట్టిన రూ.960 కోట్లను వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం తీర్చిందట. విత్తన సబ్సిడీకి పెట్టిన బకాయిల్లో రూ.384 కోట్లు తీర్చారట. ఎంఎస్‌ఎంఈలకు రూ.963 కోట్లు, ఫీజురీయింబర్స్‌మెంట్‌లో రూ.1,880 కోట్లు, ఆరోగ్యశ్రీకి రూ.685 కోట్లు, రైతుల విద్యుత్‌ సబ్సిడీలో రూ. 20 వేల కోట్లు చంద్రబాబు అప్పు పెడితే.. సీఎం వైయస్‌ జగన్‌ సర్కార్‌ రూ.8,655 కోట్లు తీర్చిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: