అమరావతిలో తెలుగు దేశం నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశారన్న ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. అంతే కాకుండా ల్యాండ్ పూలింగ్ లోనూ అక్రమాలకు పాల్పడ్డారని జోరుగా ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు వైసీపీ సర్కారు అధికారంలోకి రావడంతో ఈ అంశాలపై విచారణ సాగుతోంది. అయితే ఈ వ్యవహారంలో ఇప్పుడు భూకంపం లాంటి ఘటన జరిగింది.

 

 

ఏకంగా సీఆర్‌డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని పోలీసులు అరెస్టు చేయడం కలకలం సృష్టిస్తోంది. సీఆర్‌డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కనికెళ్ల మాధురిని విజయవాడలోని ఆమె ఇంటి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పుడు తేదీలతో నకిలీ రికార్డులు సృష్టించారన్నది ఆమెపై అభియోగం. అరెస్టు తర్వాత ఆమెను గుంటూరు జిల్లా మంగళగిరి జూనియర్ అడిషనల్ సివిల్ జడ్జి వీవీఎస్ఎన్ లక్ష్మి ఎదుట హాజరు పరిచారు. జడ్జి మాధురికి 14 రోజుల రిమాండ్ విధించారు.

 

 

ఇంతకూ అసలేం జరిగిందంటే.. టీడీపీ హయాంలో రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు రావెల గోపాలకృష్ణ 3.11 ఎకరాలను ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చినట్టు చూపించారు. అలా ఇచ్చినందుకు 3,100 చదరపు గజాలు కలిగిన 8 నివాస ప్లాట్లు, 770 చదరపు గజాలు కలిగిన రెండు వాణిజ్య ప్లాట్లను సీఆర్‌డీఏ ద్వారా రావెల గోపాల కృష్ణకు కేటాయించారు. అంతే కాదు.. మొత్తం ఐదున్నర లక్షల రూపాయల వరకూ కౌలు కూడా ఇచ్చారు.

 

 

అయితే వాస్తవానికి రావెల గోపాల కృష్ణ ఇచ్చినట్టు చూపిస్తున్న భూమి.. నాగార్జున సాగర్ రెండు రోడ్లకు చెందింది. అంటే సర్కారు భూమిని ప్రైవేటు గా భూమిగా చూపించి అక్రమాలకు పాల్పడ్డారన్నమాట. అయితే ఇంకా తవ్వితే ఇలాంటి భూబాగోతాలు చాలా బయటపడుతాయన్న ఆందోళన టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోందట. ఇంకెన్ని భూబాగోతాలు వెల్లడవుతాయో.. చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: