2020 అంటే ఏదో పెద్ద సెన్సేషన్ సంవత్సరం అనుకున్నారు.. ఈ ఏడాది ఎన్నికలు జరిగాయి.. కొత్త ప్రభుత్వాలు వచ్చాయి.. ఇక ప్రగతి పథంలో దూసుకు పోదాం అనుకున్నారు. కానీ అంతా రివర్స్ అయ్యింది.. ఈ ఏడాది 2020 పేరు చచ్చేంత వరకు గుర్తుండిపోయేలా ఉంది.  ఒకటికాదు రెండు కాదు దేశ వ్యాప్తంగా ఎన్నో విపత్తలు వచ్చిపడుతున్నారు.  ఫిబ్రవరి నెల నుంచి దేశంలో కరోనా మహమ్మారి చొరబడి ప్రజలకు శాపంగా మారింది.  మనిషిని చూసి మనిషి భయపడిపోయే పరిస్థితి నెలకొంది.  ప్రతిరోజూ కరోనా మరణాలు, కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రకృతి కోపానికి ప్రజలు విల విలలాడిపోతున్నారు.  అంఫాన్ తుఫాన్, నిసర్గ తుఫాన్లు భయాందోళనకు గురి చేశాయి. 

 

అంఫాన్ తుఫాన్ వల్ల కోట్లల్లో నష్టం వాటిల్లింది.. దాని నుంచి తేరుకోక ముందే మరో ఉపద్రవం నిసర్గ రూపంలో వచ్చింది.  ఇలా కరోనా వైరస్, తుఫాన్ల గోల కాక మిడతలు పంట పొలాలను నాశనం చేసి పోయాయి.  ఇదంతా ఒక ఎత్తైతే ఢిల్లీలో కరోనాతో పాటు భూకంపాల గొల మొదలైంది.  ఇప్పటికే పలు మార్లు ఇక్కడ భూకంపం రావడం ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. తాజాగా బుధవారం అర్దరాత్రి భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ శివారుల్లో ఉన్న నోయిడాలో ఇది చోటు చేసుకుంది. దీంతో జనం బయటకు పరుగులు తీశారు.

 

ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.  ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. నోయిడాలో 3.8 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నట్టు గుర్తించారు. హర్యానాలోని రోహతక్ కేంద్రాలుగా ఇవి మొదలయ్యాయి.  ఏప్రిల్ 12,13 తేదీల్లో కూడా ఇలాగే జరిగింది. వారం క్రితం మే 29న కూడా భూకంపం సంభవించింది. కాగా, గత కొన్ని రోజులుగా వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: