భారత దేశంలో ఇప్పుడు కరోనాతో భయపడి జనాలు నానా కష్టాలు పడుతున్నారు. కానీ కొంత మంది కామాంధులుకు ఇవేవీ పట్టనట్టు ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ ఉన్నతాధికారి తన సహ ఉద్యోగి భార్యపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. తన భర్తను ఉద్యోగం నుంచి తొలగిస్తానని బెదిరించిన ఐఏఎస్ అధికారి, ఆయన కార్యాలయంలోనే తనపై అత్యాచారం చేశారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన చత్తీస్ గఢ్ లో కలకలం రేపింది. ఏకంగా ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు రావడంతో ఈ ఘటన చత్తీస్ గఢ్‌లో కలకలం రేపింది. దీంతో ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

 

తన భర్త ప్రభుత్వ ఉద్యోగి అని, తాను చెప్పినట్టు వినకుంటే, అతన్ని డిస్మిస్ చేస్తానని బెదిరించి ఈ పనికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదు చేసింది. ఆయన్నుంచి తనకు అశ్లీల సందేశాలు కూడా వచ్చాయని పేర్కొంటూ, వాటి స్క్రీన్ షాట్స్ ను కూడా ఫిర్యాదుకు జతచేసింది. త నెల 15న ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పేర్కొంది. అతని ఫోన్ నుంచి వచ్చిన అశ్లీల మెసేజ్‌లను కూడా పోలీసులకు చూపించింది. దీంతో జిల్లా ఎస్పీ పారుల్ మాథుర్ విచారణ ప్రారంభించారు.

 

ఈ ఆరోపణలు రాగానే ఉన్నతాధికారులు జనక్ ప్రసాద్‌ను బదిలీ చేశారు. ఆయనపై భారతీయ శిక్షాస్మృతిలోని 376, 506, 309 బీ కింద కేసు రిజిస్టర్ అయిందని అన్నారు. ఇదిలావుంచితే, గత నెల 27న ఆయన ల్యాండ్ రికార్డ్స్ కమీషనర్ గా బదిలీ అయ్యారు. కాగా, ఇంకా జనక్ ప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకోలేదు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: