కేరళ లోని మళప్పురంలో క్రాకర్స్ తో కూడిన పైన్  యాపిల్ తిని ఏనుగు మరణించిన ఉదంతం దేశం మొత్తం కలచి వేసింది.  గర్భంతో ఉన్న ఏనుగు కి కొంత మంది కృర మృగాలు పైనాపిల్ లో పటాసులు పెట్టి దానికి తినిపించారు.  అది తిన్న తర్వాత పటాసులు పేలడంతో నోరు అంతా కాలిపోయి.. తినడానికి వీలు లేక ఆకలితో అలమటించిపోయింది.. ఆ తర్వాత నీటిలోకి వెళ్లి అక్కడే మరణించింది. తన నోటిని నీటిలోకి ముంచి ఉపశమనాన్ని పొందింది. ఆహారం లేకపోవడం, గాయాల తీవ్రత ఎక్కువ కావడంతో గతనెల 27న ప్రాణాలు విడిచింది. ఏనుగుకు పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించగా అది నెలరోజుల గర్భిణి అని తేలింది. గాయాలతో ఉన్నప్పటికీ ఏనుగు ఎవరికీ హాని చేయలేదు. మరణించిన ఏనుగు గర్భంతో ఉండటంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

 

ఈ ఘటనపై సాధారణ ప్రజలతో పాటు ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు.  ఈ ఘటనపై సినీ ప్రపంచం కూడా కలత చెందింది.. ఇంతటి ఘోరం మానవాలికి తగదని అభిప్రాయ పడింది.  బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్  ఏనుగు మరణం తనను తీవ్రంగా కలచివేసిందని, ఈ అమానుషానికి పాల్పడినవారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని... టాలీవుడ్ యాంకర్ అనసూయ కూడా ఈ ఘటనపై భావోద్వేగంగా సోషల్ పోస్ట్ చేశారు.  కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. ఏనుగును చంపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

 

తాజాగా కేరళలో జరిగిన ఏనుగు మృతి ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. నిందితులను వదిలిపెట్టబోమని హెచ్చరించింది.. నిందితులను పట్టుకునేందుకు కేసు దర్యాప్తులో ఏ ఒక్క అంశాన్ని వదలబోమని పేర్కొంది.  బాణాసంచా తినిపించి చంపడం భారతీయ సంస్కృతి కాదని కేంద్ర అటవీశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు.  ఇలాంటి దారుణాలకు మరోసారి జరగకుండా కఠిన శిక్ష అమలు చేసేలా చూస్తామని అన్నారు.  

 

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటా స్పందిస్తూ.. అమాయక ఏనుగును క్రూరంగా అంతమొందించిన ఘటన తనని కలచివేసిందన్నారు. అమాయక జంతువుల హత్యను సాటి మనుషుల హత్యగానే పరిగణించాలని పేర్కొన్నారు. ఎంతో మంది సినీ, క్రీడా, రాజకీయ రంగానికి చెందిన వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు.  ఇలాంటి మూర్ఖులకు కఠిన శిక్ష వేయాలని కోరారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: