కరోనా వైరస్ తో గత రెండు నెలల నుండి దేశ ఆర్థిక రాజధాని ముంబై అతలాకుతలం అవుతోంది. దేశంలోనే అత్యధిక పాజిటివ్ కేసులు బయటపడుతున్న మహారాష్ట్రలో పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉండటంతో ముంబై నగరంలో పాజిటివ్ కేసులు ఉన్నా కొద్ది బయట పడుతూనే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వాతావరణం రూపంలో ముంబాయి కి వచ్చిన ప్రమాదం కొద్దిలో ముప్పు తప్పింది. పూర్తి విషయంలోకి వెళితే అరేబియా సముద్రంలో కొట్టుకు వచ్చి మన దేశం పైకి దూసుకొచ్చిన నిసర్గ తుఫాను శాంతించి వెళ్ళిపోయింది.

IHG

మొదటిలో తీవ్ర తుఫానుగా ముంబాయి ని అతలాకుతలం చేస్తుంది అని వాతావరణ నిపుణులు అంచనా వేసిన కరోనా తో కుమిలిపోతున్న ముంబాయి ని టచ్ చేయకుండా గుజరాత్ వైపు వెళ్లి బలహీనపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తీవ్ర తుఫాన్ అవుతుందనుకున్న నిసర్గ సాధారణం కావడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. గత మూడు రోజులుగా ఎక్కడ చూసినా తుఫాన్ కి సంబంధించిన వార్తలే. మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రాల పై ప్రభావం ఎక్కువగా ఉంటుందని వార్తలు మారుమ్రోగాయి.

IHG

ముఖ్యంగా ముంబై నగరంపై ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వార్నింగ్స్  తో సిటీ నిలువెల్లా వణికింది. ఇప్పటికే కరోనాతో పోరాడుతున్న నగరవాసులు ఈ వార్త తెలుసుకుని ఇంకా భయానికి గురి కావటం జరిగింది. కానీ అంత పెద్ద ప్రమాదం ఏమీ వాటిల్లలేదు. నిసర్గ తుఫాను చివరి నిమిషంలో దిశను మార్చుకుని ప్రయాణించడం తో ముంబాయి కి ముప్పు తప్పినట్లు అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: