ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కారణం చైనా యే అని మొదటి నుండి ఆరోపిస్తున్న అమెరికా మాటలే ఇప్పుడు నిజమయ్యాయి. వైరస్ ని వ్యాప్తి చేస్తోంది చైనా యే అని అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలతో అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ(WHO) ఏకీభవించింది. దీంతో WHO తాజా ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. కరోనా పాపం చైనాదే అని వైరస్ సమాచారం ఇవ్వటం లో కావాలని లేట్ చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటినుంచి ఆరోపిస్తూనే ఉన్నారు.  ఇటువంటి ప్రమాదకరమైన మహమ్మారి కరోనా వైరస్ ని అరికట్టడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమైందని, అంతే కాకుండా చైనా దేశానికి అనుకూలంగా ప్రవర్తించిందని విమర్శలు చేశారు.

 

ప్రపంచ దేశాల ప్రయోజనాలను పరిరక్షించ లేకపోయిందని WHO చైనా ప్రభావం నుంచి బయటపడాలని తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఈ క్రమంలో ఆయన అంతే అదో టైపు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు చేసిన వారు సైతం ఇప్పుడు చైనా పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే డ్రాగన్ మాయ నుంచి WHO బయట పడుతున్నట్లు అనిపిస్తోంది. కరోనా వైరస్ ఈ విషయంలో ప్రపంచాన్ని అలర్ట్ చేయడంలో చైనా కావాలని దురుద్దేశంతో సమాచారం ఇవ్వలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

 

ఇన్నాళ్ళు చైనా కి మద్దతు తెలిపిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులే అదంతా నిజం కాదు అని చెప్పినట్లు అసోసియేటెడ్ ప్రెస్ సంచలన నిజాలను బయట పెట్టింది. వాస్తవంగా చైనాలోని ప్రయోగశాలలే ఈ పని చేసినట్లు జన్యు పరివర్తన క్రమాన్ని డీకోడ్  చేశాయి. అయితే వైరస్ నిర్ధారణ పరీక్షలు ఔషధాలు వ్యాక్సిన్ తయారీకి అత్యంత అవసరమైన ఈ వివరాలను అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం కొన్ని వారాల తర్వాత గాని వెల్లడించలేదని తెలిసింది. సమాచారం బయటకు రాకుండా కఠినతరమైన నిబంధనలు విధించినట్లు ఇటీవల బయటపడ్డాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: