ఈ మద్య కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి పాత ఇళ్లు సర్ధడం.. ఉన్న ఇంటిని శుభ్రం చేసుకోవడం.. ఇలాంటి పనులు చేస్తున్నారు. అయితే కొన్ని సందర్భంగా పాత ఇళ్లు కూల్చుతున్న సమయంలో పాములు బయట పడటం.. వాటి పిల్లలు బయట పడటంతో గుండె ఆగినంత పని అవుతుందని అంటున్నారు బాధితులు.  ఇలా ఎన్నో సంఘటనలు వెలుగు లోకి వచ్చాయి. కొన్ని చోట్లు పాముల బాధ పడలేక గ్రామాలు వదిలిపోయిన సందర్భాలు ఉన్నాయి.  పుట్టల సంగతి మనకు తెలిసిందే.. అందుకే జనాలు అటు వైపు వెళ్లారు.. కానీ కొన్ని సార్లు ఇండ్లల్లో ఎక్కడ నుంచి పాములు వస్తాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంటుంది.  

 

తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో విచిత్ర సంఘ‌ట‌న జ‌రిగింది. ఓ రైతు ఇంట్లో ఉన్న ఏసీ పైపు నుంచి 40 పాము పిల్ల‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. మీర‌ట్ జిల్లాలోని ఖంక‌ర్‌ఖేరా పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఉన్న పావ్లీ ఖుర్ద్ గ్రామంలో  ఈ ఘ‌ట‌న జ‌రిగింది. బ‌య‌ట నుంచి ఇంట్లోకి వ‌చ్చిన రైతు శ్ర‌ద్దానంద్‌.. ఇంటి వ‌రండాలో ఓ పాము పిల్ల‌ను చూశాడు.  సరే ఎక్కడ నుంచి వచ్చిందో అనుకొని భద్రంగా దాన్ని పట్టుకొని బాయట వదలి వేశాడు.   ఆ త‌ర్వాత  బెడ్‌రూమ్‌లో ప‌డుకునేందుకు వెళ్తే.. ఆ బెడ్‌పై మ‌రో మూడు పాము పిల్ల‌ల్ని చూశాడు.  దాంతో ఒక్కసారే షాక్ తిన్న శ్ర‌ద్దానంద్‌ అసలు తన ఇంట్లో ఎక్కడ నుంచి ఈ పాములు వస్తున్నాయన్న సందేహంలో మునిగిపోయాడు.

 

ఆ తర్వాత తన గ‌దిలో ఉన్న ఏసీ పైపు నుంచి కొన్ని పాము పిల్ల‌లు బ‌య‌ట‌కు వెళ్ల‌డాన్ని అత‌ను గ‌మ‌నించాడు.  అంతే మనోడి గుండె గుభేల్ మంది.. ఏసీ మెషీన్ బ‌య‌ట‌కుతీసి చూడగా.. ఆ ఏసీ పైపులో సుమారు 40 పాము పిల్ల‌ల్ని గుర్తించిన ఆ రైతు ఫ్యామిలీ షాకైంది. గ‌త కొన్ని నెల‌లుగా ఏసీ మెషీన్ వాడ‌క‌పోవ‌డం వ‌ల్ల త‌ల్లి పాము ఆ పైపులో గుడ్లు పెట్టి ఉంటుంద‌ని, ఇప్పుడు పిల్ల‌లు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు స్థానిక వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ వ‌త్స‌ల్ అభిప్రాయ‌ప‌డ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: