వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం చంద్రబాబు మాదిరిగానే వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2014 ఎన్నికలలో ఎన్నికైన చంద్రబాబు గెలిచిన తర్వాత దాదాపు టిడిపి కార్యకర్తలకు మరియు నాయకులకు ఆయన దూరమైపోయారు అని అప్పట్లో టీడీపీ లోనే అసంతృప్తి సెగలు నెలకొన్నాయి. సొంత పార్టీ నాయకులు మరియు కార్యకర్తలను పట్టించుకోకపోవటంతో పాటు ఆయన చుట్టూ కోటరీ ఏర్పడటంతో 2019 ఎన్నికలలో అధికారం కోల్పోవాల్సి వచ్చింది. సరిగ్గా ఇప్పుడు ఇదే సమస్య వైసిపి పార్టీ వాళ్లకు ఎదురవుతోంది. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చే ఏడాదిలోనే 90% హామీలను నెరవేర్చడం జరిగింది. ఈ విధంగా దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటివరకు చేయలేదు. నిజంగా ఇది చాలా గొప్ప సంగతి. కరోనా వైరస్ లాంటి కష్టకాలంలో విపత్తులో సంక్షేమ పథకాలు ఆగిపోకుండా వైయస్ జగన్ అమలు చేస్తూ  ప్రజలకు అందిస్తున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు.

 

ఇదే సమయంలో అధికార పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అదేమిటంటే పార్టీ అధికారంలో రావటం కోసం తీవ్రంగా కష్టపడిన పార్టీ శ్రేణులకు మరియు నాయకులకు పార్టీ ఎమ్మెల్యే ఎంపీ ప్రజాప్రతినిధులకు అధ్యక్షుడు దొరకక పోవటం. సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మరియు ఎంపీల కి జగన్ అపాయింట్మెంట్ దొరకడం లేదట. నియోజకవర్గాలకు సంబంధించి సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లాలన్నా ఆయన చుట్టూ సలహాదారులు కొంతమంది కోటరీ గా ఉన్నారని ఆ కారణంతోనే అధ్యక్షుడిని కలవలేక పోతున్నట్లు కొంత మంది వైకాపా వాళ్లు ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 

కనీసం ఎమ్మెల్యేలకు మరియు ఎంపీలకు కూడా అధ్యక్షుడు అందుబాటులో లేకపోతే మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి అని సొంత పార్టీ నేతల నుండి అసంతృప్తి వ్యాఖ్యలు వినబడుతున్నాయి. ఈ విధంగానే జగన్ వ్యవహరిస్తే చంద్రబాబుకి  2019 ఎన్నికల్లో తగిలిన దెబ్బ భవిష్యత్తులో తగిలే అవకాశం ఉందని కొంతమంది అంటున్నారు. ఈ విషయంలో జగన్ కొద్దిగా శ్రద్ధ పెడితే పార్టీ నాయకులకు గతంలో లాగా మాట్లాడే సమయం ఇస్తే పార్టీకి డామేజ్ అయ్యే అవకాశం ఉండదని పార్టీలో ఉన్న నాయకులు అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: