ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ హయాంలో లాండ్ పూలింగ్ పేరిట అప్పటి ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వ అధికారులు రైతులను మోసం చేసినట్లు ఆరోపణలు రావటం అందరికీ తెలిసిందే. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా రాజధాని భూముల విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక అవకతవకలకు పాల్పడ్డారు, అదేవిధంగా ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించడం జరిగింది. కాగా ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన వైసిపి రాజధాని భూముల వ్యవహారంలో ప్రత్యేకమైన మంత్రులతో సబ్ కమిటీ వేయించి జరిగిన అవినీతిని ఒక నివేదిక గా పొందుపరిచి కొద్ది నెలల క్రితం సీఎం జగన్ కి ఇవ్వడం జరిగింది. వాటిని ఆధారం చేసుకుని రాష్ట్ర సిఐడి ప్రస్తుతం చేస్తున్న విచారణలో ల్యాండ్ పూలింగ్ వ్యవహారానికి సంబంధించి సరికొత్త ప్రూఫ్స్ బయటపెట్టినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి.

 

ఈ విషయంలో అమరావతి ప్రాంతంలో డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్న కనికెళ్ల మాధురిని విజయవాడలోని ఆమె ఇంటి వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆమెను గుంటూరుజిల్లా మంగళగిరి జూనియర్ అడిషనల్ సివిల్ జడ్జి లక్ష్మి ఎదుట హాజరుపర్చగా.. పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈమె ఒక ఎమ్మెల్యే అనుచరుడికి ల్యాండ్ పూలింగ్ విషయంలో సహకారం అందించినట్లు ఇటీవల విచారణలో బయట పడింది.

 

ఇంకా ఈ  విషయంలో చాలా మంది అప్పట్లో అధికార పార్టీకి చెందిన నాయకుల పేర్లు వినబడుతున్నాయి. కాగా ఈమె చేసింది తప్పా రైటా అనేది కోర్టులో తేలాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు కోర్టులో విచారణ చేస్తున్న అధికారుల వాదనలే తప్ప ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు నోరు విప్పలేదు. మరి ఈ విషయంలో కోర్ట్ లో డిప్యూటీ కలెక్టర్ కనికెళ్ల మాధురి ఏం చెబుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: