దాదాపు పదేళ్ల పాటు కష్టపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఎంపికైన జగన్మోహన్ రెడ్డి ఫార్టీ ఇయర్స్ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును చిత్తుగా ఓడించారు. కానీ చంద్రబాబు మాత్రం జగన్ ని చాలా చులకనగా పరిగణిస్తూ... తనకి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని... జగన్మోహన్ రెడ్డి తన కింద ఓ బచ్చా అని... రాజకీయ విషయాలు జగన్ కి ఏమీ తెలియని ఎన్నో సందర్భాలలో గట్టిగానే చెప్పుకొచ్చాడు. మరోవైపు ముచ్చటైన వాక్చాతుర్యంతో తెలంగాణ ప్రజలను తన బుట్టలో వేసుకునే కెసిఆర్ తనను తాను గొప్ప రాజకీయ వేత్త గా చెప్పుకుంటాడు. తెలుగు రాష్ట్రాల్లో తనకంటే తలపండిన రాజకీయ నేతలు ఎవరూ లేరు అన్నట్టు తన ధోరణి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రాన్ని సృష్టించిన జాతిపితగా కేసీఆర్ అప్పుడప్పుడు చెప్పుకుంటారు కూడా. కానీ ఈ ఇద్దరి రాజకీయ ఉద్దండులు కేవలం ఒక ఏడాది కాలంగా సీఎంగా కొనసాగుతున్న జగన్ పాపులారిటీకి హడలిపోతున్నారు. 


ఘోరాతి ఘోరంగా పరాజయం పొంది ఇంట్లో కూర్చుంటున్న చంద్రబాబుకు... పక్క రాష్ట్రంలో పాలన చేస్తున్న కె చంద్రశేఖర రావు కు జగన్ పాపులారిటీ కొరకరాని కొయ్యగా మారింది. అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి పదవిని అధిరోహించిన జగన్ కేవలం ఏడాది కాలంలోనే అనేకమైన సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి... తమ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా జగన్ చూసి నేర్చుకోవాలని పక్క రాష్ట్ర ప్రజలు అనేలా చేసాడు. అయితే బై డిఫాల్ట్ గా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలా పరిపాలన చేస్తున్నారో సరిపోల్చడం కచ్చితంగా జరుగుతూనే ఉంటుంది. అయితే ఇప్పటివరకు రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్ కంటే గొప్పగా పరిపాలిస్తారో లేదో పక్క సర్వే ప్రకారం ఎవరు చూపించలేదు కానీ మే 28వ తారీకున ప్రభుత్వ నిర్ణయాలు, పనితీరు ఆధారంగా సీ ఓటర్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రజలు తమ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తమ మద్దతును, వ్యతిరేకతను అభిప్రాయ రూపంలో చూపించారు.


సర్వే లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పరిపాలన పై రాష్ట్రవ్యాప్తంగా 78 శాతం మంది సంతృప్తిని వ్యక్తపరిచారు. అయితే ఈ సర్వే ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలనపై దేశ వ్యాప్తంగా కేవలం 68 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయ పరిపాలన లో ప్రధాని నరేంద్ర మోడీ కంటే పది శాతం ఎక్కువ మద్దతు జగన్మోహన్ రెడ్డి రావడం అనేది ఒకింత ఆశ్చర్యపడాల్సిన విషయమే. తలపండిన రాజకీయ నేతలైన ఒడిస్సా, కేరళ ముఖ్యమంత్రులకు దాదాపు సరిసమానంగా జగన్మోహన్ రెడ్డి దేశవ్యాప్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. కానీ ఎంతో రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేత కెసిఆర్ 16వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. దీంతో కేసీఆర్ పాలన చండాలంగా ఉందని మొహం మీద చెప్పినట్లయింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నూటికి ఎనభై శాతం మంది జగన్ పరిపాలనపై సంతృప్తి వ్యక్తం చేయడం టిడిపి పార్టీకి అతిపెద్ద చేదు వార్త అని చెప్పుకోవచ్చు. 


సర్వే ఫలితాలు విడుదలయిన అనంతరం కెసిఆర్ పై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ జగన్ ని బాగా పొగుడుతూ కేసీఆర్ పై తిట్ల దండకం అందుతుంది. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ జగన్ పరిపాలనను కెసిఆర్ పరిపాలనలతో పోలుస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. 'జగన్ పాపులారిటీ జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయ్యింది. తాను నాలుగవ స్థానం సంపాదించినప్పుడు మీరు ఎందుకు 16వ స్థానానికి పడిపోయారో మా అందరికీ చెప్పాలి', అని కేసీఆర్ ని నిలదీశాడు. కేసీఆర్ ఇప్పటివరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు కాబట్టే అతడు 16వ స్థానానికి పడిపోయాడు. జగన్ మాత్రం తాను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మంచి సీఎంగా ప్రజల్లో పేరు తెచ్చుకుని పాపులారిటీని బాగా పెంచుకున్నారని ఆయన అన్నాడు. మరోవైపు టిడిపి పార్టీ, ఏపీ బీజేపీ పార్టీ జగన్ని ఎప్పటిలాగానే విమర్శిస్తూనే ఉన్నారు. కానీ అతనిపై ఎన్ని విమర్శలు చేసినా... కోర్టుల కెళ్ళి జగన్ నిర్ణయాలకు అడ్డుకట్ట వేసినా... జగన్ కి వ్యతిరేకంగా వార్తలు రాయిస్తున్నా... క్షేత్రస్థాయిలో జగన్ పాపులారిటీని తగ్గించలేకపోయారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రిగా బుల్లెట్ ట్రైన్ స్పీడ్ తో దూసుకెళ్తూ పాపులారిటీని అంచలంచలుగా పెంచుకుంటున్న జగన్ ఈ ఇద్దరి సీనియర్ నేతలకు కొరకరాని కొయ్యగా మారారు అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: