వైసీపీ పార్టీకి న్యాయస్థానాలలో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అధికారంలోకి వచ్చే ఏడాది గా వచ్చిన 50 సార్లకు పైగా నే న్యాయస్థానాలలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఈ పరిణామాలతో పాటు ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్లు ఉంటే ఇటు ప్రజలకు ప్రభుత్వంపై వ్యతిరేకత నిర్ణయాలు ఏర్పడుతున్నాయి. తాజాగా ఇటీవల గ్రామ పంచాయతీ కార్యాలయాల రంగుల కు సంబంధించి జగన్ సర్కార్ చేస్తున్న పోరాటం వృధా అయిపోయింది. గ్రామ పంచాయతీలకు అధికార పార్టీ రంగులు వేయడాన్ని పూర్తిగా తప్పు బట్టి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కింద కోర్టులో దాఖలు చేశారు.

 

దీంతో హైకోర్టు వెంటనే రంగులు తొలగించాలని వైసీపీ ప్రభుత్వాన్ని ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కి వెళ్లారు. సుప్రీం కోర్టు కూడా వైసీపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ వెంటనే నాలుగు వారాల్లోగా రంగులు తొలగించాలని లేకపోతే కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవటం జరుగుతోందని వైసీపీ సర్కార్ కి షాక్ ఇచ్చింది. దీంతో ప్రతిపక్షాలు వైసీపీ ప్రభుత్వం న్యాయస్థానం తో ఆటలు ఆడుతోంది అని ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. వెంటానే జగన్ రాజీనామా చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.

 

ఇదిలా ఉండగా వరుసగా న్యాయస్థానాల నుండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పుల రావటంతో గతంలో వైసీపీ పార్టీలో అత్యుత్సాహం కలిగిన నాయకులు ఏకంగా హైకోర్టు ని టార్గెట్ చేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో హైకోర్టు నుండి నోటీసులు అందుకున్నారు వాళ్ళు. మరి ఇటువంటి సమయంలో సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తప్పు పడతారా నాయనా అని తాజాగా వచ్చిన తీర్పుపై ప్రతిపక్షాలు అధికార పార్టీ నేతల పై సెటైర్లు పడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: