అందమైన సముద్ర తీరాన.. ఇసుక తిన్నెల్లో జక్కన్న ఎన్నో ఆకట్టుకునే బొమ్మలు చెక్కుతుంటారు. వేలాది ఆకృతులను ఇట్టే తీర్చిదిద్దుతుంటారు.  సందర్భాలను బట్టి మనకు ఇసుకతో బొమ్మలు చేసే కళాకారులు. మనసులోని భావాలకు ఇసుకతో అందమైన రూపమిస్తుంటారు.  కళ ఉచితం అని చెప్పబడిన మాటలు ఇక్కడ ఇసుకతో తయారు చేసిన సుందరమైన బొమ్మలు చూస్తె తప్పక నిజం అనిపిస్తాయి. చిత్రకారుడు ఒక బొమ్మ వేయాలంటే, ఎంతో ఖరీదైన వస్తువులు సమకూర్చుకోవాలి. కాని ఈ ప్రదేశంలోని సైకత కళ అవేవీ అసరం లేదు.. మనసు ఉంటే చాలు అంటారు కళాకారులు.  సంతోషం.. ఆనందం... బాధ ఏదైనా సకైత రూపంలో వారి మనోభావాలు చాటుకుంటారు.  తాజాగా దేశం మొత్తం కన్నీటి పర్యంతం చేసిన కేరళా ఎనుగు ఉదంతాన్ని కన్నులకు కట్టినట్టు చూపించారు ఓ కళాకారుడు.

 

కేరళలో నిండు నెలలతో ఉన్న ఓ ఏనుగును పొట్టన పెట్టుకున్నారు రాక్షసులు. ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెడుతున్నారని ఆశగా వారి నుంచి పైనాపిల్‌ అందుకుంది. బిడ్డ ఆకలి తీరుస్తున్నాలే అనుకున్నది కాని మనిషిలో దాగున్న క్రూరత్వాన్ని అంచనా వేయలేకపోయింది. నోట్లో పెట్టుకున్న పైనాపిల్‌ పేలడంతో ఏనుగు బాధ వర్ణణాతీతం. కొన్ని రోజుల త‌ర్వాత‌ తల్లిబిడ్డ ప్రాణాలు ఈ నరరూప రాక్షస లోకాన్ని విడిచి గాలిలో కలిసిపోయాయి. అయితే దీనిపై భారత దేశం మొత్తం తీవ్ర విర్శలు వెల్లువెత్తాయి.. మనిషి ఇప్పుడు మృగాలుగా మారుతున్నారు అనడానికి ఇదే ప్రత్యేక్ష సాక్షం అని వారికి కఠిన శిక్ష అమలు చేయాలని సోషల్ మీడియా సాక్షిగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

 

ఏనుగు చావుకు కారణం మనిషే. ఒక మనిషిగా సిగ్గుపడుతూ.. ఒడిశాలోని పూరీబీచ్‌లో తన శాండ్‌ ఆర్ట్‌తో ఏనుగుకు సంతాపం తెలియజేశాడు ప్రముఖ ఆర్టిస్ట్‌ సుదర్శన్‌ పట్నాయక్‌.  అంతే కాదు ‘ఏనుగు చావుతోనే మానవత్వం కూడా చచ్చిపోయింది. దయచేసి మూగజీవాల ప్రాణాలతో చెలగాటమాడొద్దు. వాటిని సురక్షితంగా జీవించడానికి సహకరిద్దాం’ అనే క్యాప్షన్‌ను జోడించి తన బిడ్డతో ఉన్న ఏనుగు ఆర్ట్‌ను ట్విటర్‌లో షేర్‌ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: