ఒకవైపు కరోనాతో దేశమంతా ఇబ్బంది పడుతుంటే దాని నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం గత మూడు నెలలుగా లాక్ డౌన్ ఐదవ సారి పొడిగించిన సంగతి అందరికీ తెలిసిందే. అసలు విషయంలోకి వెళ్తే... తెలంగాణ రాష్ట్రంలో బాల్య వివాహం జరిగింది. అది కూడా ఈనెల 1వ తారీఖున పదహారేళ్ల మైనర్ బాలికకు, 23 ఏళ్ల వ్యక్తికి వివాహం జరిగింది. అయితే ఈ విషయం కాస్త ఆలస్యంగా బయటికి వచ్చింది. దీనితో పిల్లల హక్కుల సంఘం కార్యకర్తలు మైనర్ బాలికను వివాహం చేసుకోవడానికి ప్రేరేపించడం వల్ల ipc 366 కింద వరుడు, వధూవరుల తలిదండ్రులు, పూజారి, గ్రామ పెద్దల పై కూడా బాల్య వివాహం నివారణ చట్టం, ఫోక్సో చట్టం, బలవంతంగా పెళ్లి చేయడం లాంటి కేసులను నమోదు చేశారు. 

IHG


ఇకపోతే ఈ కేసుకు సంబంధించి బాలల హక్కుల సంఘం కార్యకర్త అచ్యుతరావు... వధూవరుల తల్లిదండ్రులు. వరుడు పై. పూజారిపై జరిమానా విధించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండ్ల పోచంపల్లి కి సమీపంలో గల కండ్ల కోయలలోని ఒక గుడిలో ఈ వివాహం జరిగింది. బాలిక కు సంబంధించి కేవలం 16 ఏళ్ళు ఉండడంతో ఎఫ్ఐఆర్ లో అదే విషయాన్ని పేర్కొన్నారు. కాకపోతే ఆ వరుడు నిర్మాణ రంగానికి చెందిన ఒక కార్మికుడు.

 

 

కనీసం 30 మంది అతిథులు హాజరైన ఆ పెళ్ళికి సామాజిక దూరం పాటించకుండా మొహాలకు ఫేస్ మాస్క్ లు లేకుండా ఆ వివాహం జరిగినట్లు అక్కడి వారు తెలియజేశారు. ఒకవైపు పనులు లేక ఇబ్బందులు పడుతుంటే ఇలాంటి పనులు చేసి మరో ఇబ్బందులను కొత్తగా కొనితెచ్చుకున్నట్లు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: