దేశం ఇప్పడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.  ఓ వైపు కరోనా.. మిడతలు, తుఫాన్లు మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. మార్చి నెల నుంచి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించారు.  అప్పటి నుంచి చేయడానికి పనులు లేక పేద ప్రజలు నానా కష్టాలు పడ్డారు. ఇప్పుడిప్పుడే తమ స్వస్థలాలకు వెళ్తున్నారు.. అంతో ఇంతో పనులు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ఇప్పుడు తుఫాన్ రూపమంలో ప్రకృతి పగబట్టినట్టు ఉంది.  అంఫాన్, నిసర్గ తుఫాన్ తో చచ్చిపోతున్నారు.  కోట్లలో నష్టం వాటిల్లుతుంది. ఒడిశాలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) గురువారం ప్రకటించింది.

IHG

ఇప్పటికే అంఫాన్‌ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలను చవిచూసిన ఒడిశాను ఇప్పుడు మరో తుఫాను ముంచెత్తే అవకాశం ఉన్నదని ఐఎండీ వెల్లడించింది. జూన్‌ 8వ తేదీ కల్లా దక్షిణ మధ్య బంగాళాఖాతంలోని తూర్పు ప్రాంతాల్లో అల్ప పీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.  మే నెల ఆఖరులో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం అంఫాన్‌ తుఫానుగా మారి ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరప్రాంతాల్లో తీరాన్ని తాకింది. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో  బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి.

IHG

వర్షాల వల్ల రెండు  రాష్ట్రాల్లో తీవ్ర పంటనష్టం వాటిల్లింది. పలుచోట్ల ఆవాసాలు నీట మునిగాయి. ఈ అల్పపీడనం ప్రభావంతో జూన్‌ 10 నుంచి ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రాణ నష్టం పరంగా చూస్తే మాత్రం ఒడిశాలో అంఫాన్‌ ప్రభావం పెద్దగా పడలేదు. ఐదు మరణాలతో ఆగిపోయింది. కానీ, బెంగాల్లో తీవ్ర ప్రభావం చూపింది. ఆ రాష్ట్రంలో అంఫాన్‌ దాదాపు 76 మందిని పొట్టనపెట్టుకుంది.  మొత్తానికి మళ్లీ ఒడిశాను భయపెడుతుంది తుఫాన్. 

మరింత సమాచారం తెలుసుకోండి: