భార‌త్‌కు చిర‌కాల మిత్ర‌దేశ‌మైనా ఫ్రాన్స్ క‌రోనా క‌ష్ట‌కాలంలో 200 మిలియన్‌ యూరోల మేర రాయితీలతో కూడిన రుణాన్ని మంజూరు చేసేందుకు  ముందుకు రావ‌డం విశేషం. కోవిడ్‌-19తో పాటు  భయంకర ఉంపన్‌ తుపాను కారణంగా భార‌త్‌లో భారీ న‌ష్టం వాటిల్లిన‌ట్లుగా గుర్తించామ‌ని ఫ్రాన్స్ పేర్కొంది. న‌ష్టపోయిన బలహీన వర్గాలను ఆదుకునేందుకు ఈ మేరకు భార‌త్‌కు రుణ సాయం అందిస్తున్నట్లు ఫ్రాన్స్‌ దౌత్యవర్గాలు గురువారం ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్లడించాయి. ఇదిలా ఉండ‌గా ఉంపన్‌ తుపాను భారత్‌లో విధ్వంసం సృష్టించిన విష‌యం తెలుసుకుని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయల్‌ మాక్రాన్‌ భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయ‌డం గ‌మ‌నార్హం. 


తుపాను బాధితులకు సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్న‌ట్లు ఫ్రాన్స్ అధ్య‌క్షుడు ఆ లేఖ‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి స్ప్ష్టం చేశారు.భారత్‌లోని బలహీన వర్గాలకు ఆర్థిక‌ రక్షణ కల్పించేందుకు ప్రపంచ బ్యాంకు అందించిన సాయానికి ఫ్రాన్స్ ఆర్థిక సాయం కూడా దోహ‌దం చేస్తుంద‌ని  ఆ దేశ విదేశాంగాశాఖ ప్ర‌క‌ట‌న‌లో అభిప్రాయపడింది. ఇదిలా ఉండ‌గా దేశంలో కోవిడ్-19 వ్యాధి తీవ్రమైన సామాజిక వ్యాప్తి దశకు చేరిందని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ వైద్య నిపుణులు, ఐసీఎంఆర్ కోవిడ్ -19 అధ్యయన బృందం సభ్యులు వెల్లడించారు. దేశంలో కోవిడ్-19 మహమ్మారితో ఇప్పటివరకు 6వేల‌కు చేరువ‌లో ఉంది.  పాజిటివ్ కేసుల సంఖ్య 2ల‌క్ష‌లు దాటేసింది. 


అమెరికా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్, స్పెరుున్ ఇటలీల తర్వాత ఏడో స్థానంలోకి భారత్ చేరిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గణాంకాలు చెబుతున్నాయి. భారత్‌లో కరోనా జోరు క‌నిపిస్తోంది. రోజురోజుకూ విశ్వరూపం చూపిస్తోంది... గ‌డిచిన ప‌క్షం రోజుల్లోనే కేసుల సంఖ్య‌ రెట్టింపు కావ‌డం గ‌మ‌నార్హం. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన  హెల్త్ బులెటిన్లోని వివరాల‌ ప్రకారం.. గడచిన 24 గంటలలో 9,304 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,16,919కు చేరుకోగా.. మరణించినవారి సంఖ్య 6,075కు చేరుకుంది. ఒకేరోజు 260 మంది మృతిచెందారు.. 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: