తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఇపుడు ఎన్నడూ లేని టెన్షన్లో ఉన్నారు. ఓవైపు యువ ముఖ్యమంత్రి జగన్ దూసుకుపోతున్నారు. భారంగా ఏడాది కాలం గడచింది. ఇంకా నాలుగేళ్ళు గడవాలి అదేలా అనుకుంటూంటే పార్టీలోని నాయకులు ఎవరి మటుకు వారు ఉన్నారు. 

 

పార్టీ కాడె వదిలేసి దుప్పటి కప్పుకున్న నేతల లిస్ట్ కూడా చాలా పెద్దదే.  అదే సమయంలో వైసీపీ ట్రాప్ లో చిక్కుకుని రేపు మాపో వెళ్ళిపోవడానికి కొంతమంది నాయకులు చూస్తున్నారని కూడా బాబుకు సమాచారం ఉంది.

 

నిజంగా చెప్పాలంటే 2004, 2009 ఎన్నికల్లో పార్టీ ఓడింది. కాని దానికి మించి ఇపుడు పార్టీ ఇబ్బందులో ఉందని అంటున్నారు. అప్పట్లో బాబు వయసు, పరిస్థితులు కూడా బాగా కలసివచ్చాయి. ఇపుడు మాత్రం కధ అలా సాగడంలేదు. 

 

టీడీపీలో ఎంత కాదనుకున్నాన నైరాశ్యం ఉంది. దాన్ని పోగొట్టడానికి మహనాడు నిర్వహిద్దమనుకుంటే కరోనా మహమ్మరి వల్ల జాం యాప్ తో సర్దుకోవాల్సిన్వచ్చింది. ఇక మహనాడు కూడా పూర్తి అయి పది రోజులు దగ్గరపడుతోంది. ఈ నేపధ్యంలో పార్టీ కమిటీలు వేయాలని బాబు డిసైడ్ అయ్యారుట. 

 

పార్టీకి వీర విధేయులుగా ఉన్న వారికే పదవులు ఇవ్వాలని కూడా బాబు అనుకుంటున్నారుట. ఎవరైతే పార్టీకి దూరంగా ఉంటున్నారో వారిని అసలు పట్టించుకోరాదని, వీలైతే వారు బయటకు వెళ్ళిపోవడమే మంచిదని కూడా బాబు అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

 

పార్టీకి కచ్చితమైన నాయకులు, అంకితభావం కలిగిన వారిరెన ఎంపిక  చేసి వారి ద్వారా జగన్ సర్కార్ మీద పోరు చేయాలని బాబు డిసైడ్ అయ్యారని టాక్. ఈ నేపధ్యంలో పార్టీలో ఏపీ అధ్యక్ష పీఠానికి అచ్చెన్న పేరుని బాబు ప్రతిపాదిస్తున్నారని అంటున్నారు.

 

అయితే ఆయనతో పాటుగా మరో బీసీ సామాజికవర్గాన్నికి చెందిన బీద రవిచంద్ర  పేరుని కూడా బాబు పరిశీలిస్తున్నారని అంటున్నారు. మరి చూడాలి ఆయనకే కళా వెంకటరావు ప్లేస్ లో ఏపీ ప్రెసిడెంట్ పదవి ఇస్తారేమో.  యాదవ సామాజిక వర్గానికి చెందిన బీద పార్టీలో అన్న మస్తాన్ రావు వైసీపీలో చేరినా ఉంటున్నారు. అదే బాబుకు నచ్చిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: