ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రపంచంలో కనీ వినీ ఎరుగని రీతిలో జరుగుతున్న వింతలూ విచిత్రాలు ప్రజలకు చూసే సౌకర్యం లభిస్తుంది.  గతంలో ఏదైని విచిత్రం జరిగితే ఫోటోలు పేపర్లో, మ్యాగజైన్స్ లో వస్తే చూసేవారు. వ్యూజువల్ గా చాలా అరుదుగా చూసేవారు. ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో.. వ్యూజువల్స్ తో సహా ప్రజలకు కనువిందు చేస్తున్నారు.  మనుషులకు సంబంధించినవే కాదు.. పశుపక్షాదులు చేస్తున్న వింతలు విచిత్రాలు కళ్ల ముందు ఆవిష్కరిస్తున్నారు.  కోతి, కింగ్‌ కోబ్రాల పోరుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. సుశాంత నందా అనే ఐఎఫ్‌ఎస్‌ అధికారి తన ట్విటర్‌లో ఈ వీడియో షేర్‌ చేశారు. అంతేకాకుండా ఈ వీడియో చాలా ఉత్కంఠగా ఉందని, శ్వాస కూడా తీసుకోకుండా వీక్షించినట్లు పేర్కొన్నారు.

 

అంత భయంకరమైన కోబ్రాతో కోతి గెలిచిందని అంటున్నారు. అంతేకాకుండా అద్భుత పోరాట స్పూర్థిని ప్రదర్శించిందని సుశాంత నంద ట్వీట్‌లో పేర్కొన్నాడు. కోతి అసాధారణ పోరాటానికి కింగ్‌ కోబ్రా తోక ముడుచుకొని వెళ్లిపోయింది. థ్రిల్లింగ్‌ యాక్షన్‌ ఫైట్‌కు సంబంధించిన ఈ వీడియో చూసిన నెటిజన్లు కోతి పోరాటానికి ఫిదా అవుతున్నారు. సాధారణంగా పామును చూస్తే కప్ప ఇక నా పని అయిపోయిందిరా బాబో అనుకుంటుంది.. ఎందుకంటే పాములకు పసందైన విందు కప్పలు. పాముకి కప్ప కనిపిస్తే చాలు, లటుక్కున నోట్లోకి లాగేసుకొని ఆరగించేస్తుంది.

 

అదే కప్పకు, పాము కనిపిస్తే అక్కడి నుంచి సల్లగా జారుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఓ వీడియో మాత్రం ఇందుకు పూర్తి విరుద్దంగా ఉంది. . పామును చూసి కప్ప భయపడలేదు. అలాగే కప్పని చూస్తే పాముకి నోరూరలేదు. ఈ రెండూ కలిసి ఎంచెక్కా ఆడుకుంటున్నాయి. ఈ రెండూ బద్ధశత్రువులు. అటువంటిది కలిసిమెలిసి ఆడుకుంటున్న వీడియోను ఇండియన్‌ ఫారెస్ట్‌ అధికారి ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ఇప్పుడు ఇది నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంది. మొత్తానికి ఇక్కడ కప్పధైర్యానికి అందరూ ఫిదా అవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: