లాక్ డౌన్ ఆంక్షల సడలింపు అనంతరం తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకింత పెరుగుతున్నాయి . రానున్నా రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్న కేంద్ర ప్రభుత్వ  సూచనలతో కేసీఆర్ సర్కార్ అప్రమత్తమైంది . కరోనా బాధితుల సంఖ్య పెరిగితే జిల్లా ఆసుపత్రుల్లోను చికిత్స అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది . ఈ మేరకు దాదాపుగా మూడు నెలలకు అవసరమైన  అవసరమైన మందులు , ఆక్సిజన్ సిలిండర్లు , వెంటిలేటర్లు రెడీ చేసుకుంటోంది . కరోనా బాధితుల సంఖ్య ఎంతగా పెరిగినా, చికిత్స అందించేందుకు వీలుగా 13 జిల్లా ఆసుపత్రులలో అన్ని ఏర్పాట్లు చేస్తోంది .

 

జులై నాటికి రాష్ట్రం లో దాదాపు 60 వేలమంది కరోనా పాజిటివ్ కేసులు నమోదు చేసుకునే అవకాశముందన్న అంచనాకు వచ్చిన కేసీఆర్ సర్కార్ , ప్రైవేట్ , కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ కరోనా బాధితులకు చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటోంది .  50 వేలమందికి కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు వీలుగా మందుల నిల్వలు పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం , అవసరమైన వెంటిలేటర్ల అందుబాటులో లేకపోవడంతో మరిన్ని వెంటిలేటర్లకు ఇండెంట్ ఆర్డర్ ఇచ్చింది . కరోనా బాధితులకు 54 రకాల మందులు వాడాల్సి ఉంటుందని , దానికి తగ్గట్టుగా అవసరమైన అన్ని మందులను సమకూర్చుకుంది .

 

రెండు నెలల పాటు  లాక్ డౌన్  ఆంక్షలు కఠినంగా అమలు చేయడం ద్వారా కరోనా కేసుల సంఖ్య తక్కువగా నమోదు కాగా , ఆంక్షల సడలింపు అనంతరం కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది . దానికితోడు తెలంగాణ లో కరోనా పరీక్షలు కూడా తక్కువగా చేస్తున్నారని హైకోర్టు ఆక్షేపించడం , పరీక్షల సంఖ్య పెరిగితే మరింతగా కరోనా కేసులు పెరిగే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు విన్పిస్తున్నాయి . 

మరింత సమాచారం తెలుసుకోండి: