ఇండియా పేరును భారత్ గా మార్చాలి అంటూ కోర్టులో దాఖలైన పిటిషన్ ప్రస్తుతం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా ఈ పిటిషన్ చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే దీనిని ఒక వినతిపత్రం కింద మార్చింది దేశ అత్యున్నత న్యాయస్థానం. అయితే ఈ విషయంలో మాత్రం వాదనలు ఎంతో ఆసక్తికరంగా సాగుతున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. దీనికి సంబంధించిన వివరాలు  కొన్ని పత్రికల్లో కూడా ఇప్పటికే ప్రచురితమయ్యాయి. అయితే ఇలా ఇండియా పేరును భారత్ గా మార్చాలి అని పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి తరపు న్యాయవాది.. ఇండియా అనే పదం గ్రీకు ఇండికా  అనే పదం నుంచి ఉద్భవించింది. భారత్ అనే పేరు  మొదటినుంచి ఉన్నటువంటి పేరు. 

 


 ఇందులో నగరాలతో కూడినటువంటి ఒక సమూహం అయినటువంటి పేరు భారతదేశం అనే పేరు. అందుకే దీనిని  భారత్ అనే కంటిన్యూ చేయాలని ఇండియా పేరును మార్చాలని అంటూ... వాదనలు వినిపించిన నేపథ్యంలో  సుప్రీంకోర్టు మాత్రమే పిటిషన్ను కొట్టి  వేస్తాం అంటూ తెలిపింది. అయితే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సింది కోర్టులు కాదు ప్రభుత్వాలు అంటూ తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. ఇలాంటి పిటిషన్ల ద్వారా ఇండియా పేరును భారత్ గా మార్చడం కుదరదు అంటు తెలిపింది సుప్రీం కోర్ట్. అయితే ఈ పిటిషన్ను వినతిపత్రం గా న్యాయస్థానం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వెళ్లేలా  చేయాలని కోరగా  దీనికి అంగీకరించింది అత్యున్నత న్యాయస్థానం. 

 


 అయితే ఇప్పుడు ఇండియా పేరును భారత్ గా మార్చాలా లేదా హిందుస్థాన్ గా మార్చాలా  అన్నది ప్రస్తుతం మోడీ  చేతిలోకి వచ్చేసింది. అయితే ఇప్పుడు ప్రపంచ దేశాలు భారత్ ని భారత్ అనే ఇండియా అని పిలుస్తారని ఇందులో ఎలాంటితేడా  లేక పోయినప్పటికీ బ్రిటిష్ ముద్ర నుంచి బయటపడాలి అన్నటువంటి భావన   ప్రస్తుతం పిటిషనర్ వాదన అని అంటున్నారు విశ్లేషకులు. అయితే పిటిషనర్ ఇండియా పేరును భారత్ గా మార్చాలని  పిటిషన్ దాఖలు చేసినప్పటికీ  దీన్ని దేశ ప్రజానీకం కూడా అంత సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించడం లేదు అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: