త్వరలో ఏపీ కేబినెట్ లో మార్పులు చేర్పులు చేర్పులు చోటుచేసుకునేలా కనిపిస్తున్నాయి. కొంత మంది మంత్రుల పనితీరుపై అసంతృప్తితో ఉన్న సీఎం జగన్ వారిని తప్పించి, వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని చూస్తున్నారు. అలాగే జూన్ 18వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ తరఫున ప్రస్తుత మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ తమ మంత్రి పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉంది. దీంతో వారి శాఖల్లో తప్పనిసరిగా ఇద్దరికీ అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పనితీరు సక్రమంగా లేని మంత్రులను తప్పించి సమర్థులైన వారిని ఆస్థానం కూర్చోబెట్టాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

IHG


ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొంతమందిపై జగన్ ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే నిఘా వర్గాల ద్వారా సేకరించిన సమాచారం మేరకు ఒకరిద్దరు మంత్రులు అవినీతి వ్యవహారాల్లో బాగా మునిగి తేలుతున్నారు అని ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు వస్తున్నా, లెక్క చేయడం లేదని రిపోర్టులు జగన్ కు అందాయి. గతంలోనే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే సమయంలో జగన్ పనితీరు సక్రమంగా లేని వారు ఎవరిని ఉపేక్షించేది లేదని , ఈ విషయంలో ఎటువంటి మొహమాటం లేకుండా వారిని తప్పిస్తానని గతంలోనే ప్రకటించారు. ఈ మేరకు ఇప్పుడు ఆ సమయం వచ్చినట్లుగా కనిపిస్తోంది. త్వరలోనే రాజ్యసభ సభ్యులు కాబోతున్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానాల్లో  ఇద్దరికి అవకాశం ఇవ్వడంతో పాటు ప్రస్తుతం ఉన్న మరో ఇద్దరు మంత్రులను తప్పించాలని చూస్తున్నారు.

 


 ఆ స్థానంలో పార్టీ వాయిస్ బలంగా వినిపించేవారు, తమ రాజకీయ ప్రధాన ప్రత్యర్థి టిడిపి పై గొంతెత్తి మాట్లాడగలిగే నాయకులను మంత్రులుగా తీసుకోవాలని, అలాగే ఎటువంటి అవినీతి మచ్చలేని వారిని మంత్రులు గా ఎంపిక చేయాలని జగన్ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ దృష్టిలో పడేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున ఆశావహులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో జగన్ ఏ విధంగా ముందుకు వెళతాడో చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: