ఒక్కోసారి ప్రత్యర్ధుల మీద గురిపెట్టి విసిరే బాణాలు రివర్స్ లో వచ్చి తగులుతూ ఉంటాయి. అప్పుడు తప్పు ఎక్కడ జరిగింది అని ఆలోచించినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇప్పుడు ఆ విధంగానే తెలుగుదేశం పార్టీ విషయంలోనూ చోటుచేసుకోవడం చర్చనీయాంశం అవుతోంది. వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామని ప్రయత్నించి తామే ఇరుకున పడడం, ఇప్పుడు తలెత్తుకోలేని పరిస్థితి రావడం వంటి పరిణామాలు ఎన్నో జరిగిపోయాయి. నర్సీపట్నం మత్తు డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో టిడిపి కాస్త అతిగా స్పందించింది. సుధాకర్ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నించింది. ఆఖరికి టిడిపి అధినేత చంద్రబాబు సైతం మహానాడులో సుధాకర్ అంశాన్ని పదే పదే ప్రస్తావించారు.

IHG


 సుధాకర్ వ్యవహారంలో ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని, అందుకే సీబీఐ విచారణకు ఆదేశిస్తామని హైకోర్టు కూడా వ్యాఖ్యానించడంతో ఈ వ్యవహారంలో వైసీపీ బురద జల్లుకునేందుకు అవకాశం ఏర్పడిందని తెలుగుదేశం పార్టీ అభిప్రాయపడింది. డాక్టర్ సుధాకర్ హోదాను కూడా పట్టించుకోకుండా, కేవలం ఆయన సామాజిక వర్గాన్ని హైలెట్ చేసి టిడిపి వైసిపి ప్రభుత్వం పై బురదజల్లేందుకు ప్రయత్నం చేసింది. ఇప్పటికే రంగంలోకి దిగిన సీబీఐ సుధాకర్ వ్యవహారంలో అనేక ఆధారాలను సంపాదించింది. సిబిఐ విచారణలో సుధాకర్ తీరు, దొరికిన సాక్ష్యాల ఆధారంగా ఆయన పైన కేసు నమోదు చేయడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.

 

 సుధాకర్ నిబంధనలు అతిక్రమించి మరీ విశాఖ వీధుల్లోకి రావడం, ముఖ్యమంత్రి, ప్రధాని ఇష్టమొచ్చినట్లుగా తిట్టడం, పోలీసులను ఆ విధంగానే తిట్టడం, వంటి వాటిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇప్పటి వరకు సుధాకర్ వ్యహారంలో ఎక్కువగా స్పందించిన  తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు వెనకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయంపై వ్యాజ్యాన్ని వేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపుడి అనిత సుధాకర్ వైపు జరిగిన తప్పులను ఏవీ చూపించకుండా, ఒక వైపు మాత్రమే జరిగిన వ్యవహారాన్ని హైలెట్ చేస్తూ నానా హడావుడి చేశారు.


 ఇప్పుడు సుధాకర్ వ్యవహారంలో రెండో కోణం కూడా బయటపడటంతో టిడిపి ఈ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే విషయంలో తికమకపడుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసిన చంద్రబాబు, లోకేష్ మరి కొంతమంది టిడిపి నాయకులు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అటు తిరిగి ఇటు తిరిగి ఈ వ్యవహారం పూర్తిగా తమకే చుట్టుకోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో వీరంతా ఉండిపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: