కేరళ.. దక్షిణాదిలోని చిన్న రాష్ట్రాల్లో ఒకటి. అక్కడ అక్షరాస్యత ఎక్కువన్న సంగతి తెలిసిందే. కేవలం అక్షరాస్యతలోనే కాదు.. మానవాభివృద్ధి విషయంలో కేరళ మిగిలిన దక్షిణాది రాష్ట్రాల అన్నింటికంటే ముందే ఉంటుంది. గత ఇరవై ఏళ్లలో చూస్తే మిగతా అన్ని రాష్ట్రాల కంటే, అతి తక్కువ నవజాత శిశు మరణాలు నమోదు అయ్యేది కేరళ లోనే. మానవాభివృద్ధిలో ఈ నవజాతశిశు మరణాల రేటుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది.

 

 

ఈ నవజాత శిశుమరణాల రేటు 2016లో ఇండియా సగటు 34 ఉంటే, కేరళ లో 10 మాత్రమే. అదే తెలంగాణలో అయితే ఈ సగటు 31గా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ లో ఈ సగటు 34గా ఉంది. ఇక ఉత్తర్ ప్రదేశ్ లో 43, మధ్య ప్రదేశ్ లో 47 ఇలా ఉన్నాయి లెక్కలు. మరి కేరళ మాత్రం అతి తక్కువ మరణాల రేటుతో మంచిస్థానం సంపాదించింది. ఇక్కడ నవజాతశిశువుల మరణాల రేటు కేవలం 10మాత్రమే. కేరళ లో మొదటి నుంచే ఇలాంటి సేవలు బాగా ఉన్నాయి.

 

 

మరో కీలకమైన విషయం ఏంటంటే.. ప్రపంచంలో ఎక్కడైనా అక్షరాస్యత ఎక్కువ ఉంటే.. ముఖంగా మహిళల్లో.. అక్కడ జనాభా పెరుగుదల తక్కువ ఉంటుంది.. ఉదాహరణకు నైగర్ అనే ఒక ఆఫ్రికన్ దేశం లో సగటున ఒక్కొక్క మహిళా ఆరు మందికి పైనే కంటోంది.. అదే సింగపూర్ లో ఒకటి మాత్రమే. లేకపోతే అది కూడా లేదు. ఈ విషయంలోనూ కూడా మన దేశం లో కేరళ మిగతా అన్ని రాష్ట్రాల కంటే ముందే ఉంది.

 

 

ఏది అభివృద్ధి? ఏది నాగరికత? ఎవరు ఎవరికి నేర్పుతారు? ఏ ప్రభుత్వం తమ రాష్ట్ర ప్రజల గురించి ఎక్కువ పట్టించుకుంటుంది.. ఈ విషయాల గురించి ఆలోచిస్తే.. ఎన్ని ప్రాజెక్టులు కట్టాం.. ఎంతగా సంక్షేమ కార్యక్రమాలు పెట్టాం.. ఎంతగా డబ్బు పంచాం అన్నది కాదు.. ఎంతగా మానవాభివృద్ధి జరిగింది అన్నదే ముఖ్యం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: