తెలుగు దేశం అధినేత చంద్రబాబుకు వలసల భయం పట్టుకుంది. సొంత పార్టీ నేతల్లో ఎవరు ఉంటారో.. ఎవరు వెళ్లిపోతారో అర్థం కాకుండా ఉంది. కేవలం గెలిచింది 23 మంది ఎమ్మెల్యేలే అయినా అందులోనూ ఇద్దరు, ముగ్గురు ఇప్పటికే పార్టీకి దూరంగా ఉంటున్నారు. మిగిలిన వారిలోనూ కొందరు ఇప్పటికే వైసీపీ వైపు చూస్తున్నట్టు రోజూ వార్తలు వస్తున్నాయి.

 

 

ఇలాంటి సమయంలో చంద్రబాబుకు సొంత జిల్లాలోనే ఊహించని షాక్ తగిలింది. తెలుగుదేశంపార్టీకి చిత్తూరు జిల్లాలో మరో నేత గుడ్ బై చెప్పారు. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే.ఎస్.మనోహర్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. మనోహర్ గతంలో సుదీర్ఘకాలం టీడీపీలో ఉన్నారు. ఆయన చిత్తూరు మున్సిపల్ చైర్మన్ గా కూడా పని చేశారు. ఆ తర్వాత కాలంలో ఓసారి ఎమ్మెల్యే కూడా అయ్యారు.

 

 

ఇక 2014 ఎన్నికల సమయంలో మనోహర్ వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరారు. అయితే అప్పుడు ఆయనకు పార్టీ తరపున టిక్కెట్ రాలేదు. ఆ కోపంతో ఆయన మళ్లీ టిడిపిలోకి వచ్చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసినా ఓడిపోయారు. ఇక ఇప్పుడు ఆయన ఏకంగా తెలుగు దేశానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే.. ఆయన భవితవ్యంపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

 

 

మనోహర్ మాత్రం తన ఫ్యూచర్ గురించి ఏమీ చెప్పడం లేదు. వైసీపీలో చేరేందుకే రాజీనామా చేశారని ఊహాగానాలు వస్తున్నా.. ఆయన మాత్రం ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే.. కొంతకాలం ఏ పార్టీలో చేరనని, ఆ తర్వాత తాను ఏ పార్టీలో చేరేది చెబుతానని మనోహర్ అంటున్నారు. మొత్తానికి చంద్రబాబుకు సొంత జిల్లాలోనే మరోసారి షాక్ తగిలిందన్నమాట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: