లాక్ డౌన్ అన్ని రంగాలను కుంగదీస్తోంది. దాదాపు 70 రోజులపాటు సాగిన కఠిన లాక్ డౌన్ ఆర్థికంగా పలు రంగాలను కుదేలు చేసింది. ప్రభుత్వాలు సైతం ఆదాయం లేక కటకటలాడాయి. అసలే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ లాక్ డౌన్ వేళ మరింత ఇబ్బందులు ఎదుర్కొంది. లాక్ డౌన్ సమయంలో ఏపీ సర్కారు నెలకు రూ. 10 వేల కోట్ల ఆదాయం కోల్పోయిందట. ఈ విషయాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్ చెబుతున్నారు.

 

 

రాష్ట్ర టూరిజం రంగంలో ఆదాయం పెంచే చర్యలపై దృష్టి సారించిన అవంది... అభివృద్దికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. టూరిజం ను ఆదాయం తెచ్చే శాఖగా మార్చాలన్నది తమ లక్ష్యమని ఆయన అన్నారు. పర్యాటక రంగం ద్వారా ఆదాయాన్ని ఏ విధంగా సమకూర్చాలనే అంశంపై కసరత్తు చేస్తున్నామని.. అరకు, గండికోట, హర్స్‌లీ హిల్స్ వంటి ప్రాంతాల్లో ఫైవ్ స్టార్, సెనెన్ స్టార్ రిసార్ట్స్ నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నామని అవంతి తెలిపారు.

 

 

అంతే కాదు.. ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా హోటళ్లు , రెస్టారెంట్లు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దం అవుతోంది. ఇప్పటికే మంత్రులు అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్ హోటళ్ల యాజమాన్యాలతో ఈ విషయంపై చర్చించారు. ఆ తర్వాతే ఎనిమిదో తేదీ నుంచి రాష్ట్రంలో హోటళ్లు.. రెస్టారెంట్లు ప్రారంభించవచ్చు అని అవంతి శ్రీనివాస్ ప్రకటించారు. ఏపీలో అతిపెద్ద కోస్తా తీరం.. సుందర నదులు.. టూరిస్ట్ స్పాట్లు చాలా ఉన్నాయి.

 

 

టూరిస్టులు, యాత్రీకుల వసతి కోసం హోటళ్లు నిర్వహిస్తూనే కోవిడ్ నివారణ చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని అవంతి అంటున్నారు. అన్ని చోట్లా హోటళ్లు ఓపెన్ చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నారట. పుణ్య క్షేత్రాల్లో కూడా హోటళ్లను తెరిచేలా చర్యలు తీసుకుంటామంటున్నారు అవంతి శ్రీనివాస్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: