ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన గత రెండు రోజులుగా జలవనరుల శాఖ్ ఆధికారులను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు ఎక్కువగా చేస్తూ వస్తున్నారు. అధికారులు అసలు తన నియోజకవర్గాన్ని పూర్తిగా మర్చిపోయారు అని రాష్ట్రంలో తన నియోజకవర్గానికి తీరని అన్యాయం జరుగుతుంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఆనం కొద్ది రోజులుగా జిల్లాకే చెందిన మంత్రుల‌తో పాటు ఒక‌రిద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేల‌నే టార్గెట్ గా చేసుకుని విరుచుకు పడుతోన్న సంగ‌తి తెలిసిందే.

 

ఆయన అలా అన్నారో లేదో ఆ కాసేపటికే మరో ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కూడా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసారు. ఆయన కూడా అధికారులనే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. అధికారులు ఎంత మాత్రం మాట విన‌డం లేద‌ని ఆయ‌న ఫైర్ అయ్యారు. అసలు అధికారులు నిజంగానే ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతున్నారా ? లేక వీళ్ళు కావాలని అంటున్నారా అనేది పక్కన పెడితే ఇన్ని విమర్శలు చేస్తున్నా సరే అధికారులు మాత్రం వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం లేదు. 

 

ఎందుకు ఈ విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు అనేది ఇప్పుడు ఎవరికి అంతుబట్టడం లేదు. జగన్ చెప్పినా సరే స్వర్ణముఖి సోమసీల కెనాల్ ని అధికారులు పరిశీలించలేదు అని ఆనం వ్యాఖ్యానించారు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు సైతం ఇసుక విష‌యంలో ప‌రోక్షంగా అధికారుల తీరుపై విరుచుకు ప‌డ్డారు. ఎందుకు ఈ విధంగా అధికారులు టార్గెట్ అవుతున్నారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చలకు వేదికగా మారింది. మరి జగన్ ఏ చర్యలు తీసుకుంటారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: