అమెరికా నల్లజాతి వివక్షపై పోరాటంతో అట్టుడుకుతోంది. జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతి యువకుడిని పోలీసులు దారుణంగా గొంతుపై కాలేసి తొక్కి చంపిన ఘటన అమెరికాను కుదిపేస్తోంది. చివరకు ఒక దశలో అధ్యక్షుడు ట్రంప్ సైతం బంకర్‌లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు కాస్త పరిస్థితి కుదుటపడింది. అయితే ఈ ఉద్యమంలో అనూహ్యంగా ఓ ఇండియన్ అమెరికా జాతీయ హీరో అయ్యాడు.

 

 

ఆ భారతీయుడి పేరు రాహుల్ దూబే. నివాసం అమెరికాలోని వాషింగ్టన్. ఇంతకూ మనోడు ఏంచేశాడంటే.. పోలీసులు కర్ఫ్యూ విధించిన వేళ.. రాత్రి సమయంలో వందల మంది నల్లజాతి వారికి తన ఇంట్లో ఆశ్రయం కల్పించాడు. వారికి ఆహారం ఇచ్చి ఆదుకున్నాడు. రాహుల్ దూబే పదిహేడేళ్లుగా వాషింగ్టన్ డీసీలో ఉంటున్నాడు. ఆయనకు అల్వారెజ్ ట్రేడింగ్ అనే వ్యాపార సంస్థ ఉంది.

 

హఠాత్తుగా కర్ఫ్యూ విధించడంతో ఆందోళనకారులు రాత్రి వేళ ఎటు వెళ్లాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు. ఓవైపు పోలీసులు తరుముతున్నారు. అలాంటి సమయంలో రాహుల్ దూబే వారికి అండగా నిలిచాడు. ఆ రాత్రందా రాహుల్ దూబే ఇంటి తలుపులు తెరుచుకునే ఉన్నాయి. వచ్చిన వారిని కాదనకుండా తన ఇంట్లో ఏదో ఒక మూల ఆశ్రయం కల్పించాడు రాహుల్ దూబే.

 

 

దీంతో ఇప్పుడు నల్లజాతి ఉద్యమకారులు రాహుల్ దూబేపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తమకు కష్టకాలంలో అండగా నిలచిన రాహుల్ ను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అవి కాస్తా వైరల్ కావడంతో ఒక్కసారిగా రాహుల్ దూబే మీడియాకూ ఓ మంచి వార్తగా మారాడు. ఇప్పుడు అమెరికా మీడియాలో రాహుల్ దూబే పేరు మార్మోగిపోతోంది. చాలామంది నల్ల జాతీయులు రాహుల్ దూబే ఈజ్ ఏ హీరో అంటూ తమ ప్రొఫైల్ పిక్కులు పెట్టుకున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: