ప్రపంచంలో మనిషి రెండే రెండింటికి భయపడతారు.. ఒకటి దేవుడు మరొకటి దెయ్యం.  ఈ రెండు మనిషిని చిన్నప్పటి నుంచి పెద్దలు కల్పించిన సెంటిమెంట్.  దేవుడు అంటే ఎంత భక్తి ప్రపత్తులతో ఉంటారో.. దెయ్యం అంటే అంతగా భయపడతాడు.  ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా భయంతో ఊగిపోతుంది.  ఈ సమయంలో కొంత మంది ఇంటి వద్ద ఉంటే భయంతో బతుకుతున్నారు. రెండు నెలలు లాక్ డౌన్ సందర్భంగా ఇంటికే పరిమిత అయిన వారు పిచ్చిపట్టినట్టుగా చేసిన విషయం తెలిసిందే. అయితే కరోనా పాజిటీవ్ వచ్చిన వానికి క్వారంటైన్ కి తరలిస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో క్వారంటైన్ సెంటర్‌లో దెయ్యం తిరుగుతోందని భయపడి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

 

కర్నూలు జిల్లా కోసిగిలోని ఆదర్శ పాఠశాల వసతి గృహంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే తనకు దెయ్యం కనిపిస్తుందని.. భయం భయంగా ఉందని అతని భార్యకు తెలిపాడు.  ఇక్కడ ఆత్మలు తిరుగుతున్నాయి.. తన చుట్టూ దెయ్యం తిరుగుతోందని వెంటనే వెళ్లిపోదాం అంటూ తన భార్యతో గొడవపడ్డాడు. చివరకు అక్కడే ఓ కిటికీకి ఉరేసుకున్నారు. వెంటనే స్థానికులు అతన్ని గమనించి ఆస్పత్రికి తరలించారు.  ఇటీవల ముంబై నుంచి వచ్చిన బాబు అనే వలస కూలీ తన భార్యతో కలిసి సొంత గ్రామానికి వచ్చాడు. 

 

అతన్ని ఆదర్శ పాఠశాల వసతి గృహంలో  క్వారంటైన్ కి తరలించారు. బాబు మాత్రం తరుచూ దెయ్యం ఉందని భయపడిపోయేవాడు. వెంటనే ఇక్కడ నుంచి తనను తీసుకు వెళ్లాలని కోరేవాడు. ఈ క్రమంలోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. కాగా, క్వారంటైన్ ఏర్పాటు చేసిన స్కూలు బిల్డింగ్ కూడా పాతబడిపోయి బూత్ బంగ్లాగా ఉందని స్థానికులు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: