జగన్ సర్కారు సంక్షేమానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. అందులోనూ బడుగు బలహీన వర్గాలకు ఎక్కువగా లబ్ది చేకూరుస్తోంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వర్గాలే తమకు దూరమయ్యాయని భావిస్తున్న తెలుగుదేశం మళ్లీ ఆ వర్గాలను దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా దళితులకు సంబంధించిన సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తోంది.

 

 

అందుకే.. వైసీపీ కూడా ఈ విషయంలో ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తోంది. తాజాగా

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ టీడీపీపై విమర్శలు గుప్పించారు. దళిత సంక్షేమానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కట్టుబడి ఉన్నారని, ఏడాది పాలనలోనే దళిత సంక్షేమానికి రూ.6,891 కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు. ఏడాదికాలంలో 80,86,187 మంది ఎస్సీలకు సంక్షేమ పథకాల ద్వారా రూ.6,891 కోట్లు నేరుగా వారి బ్యాంక్‌ అకౌంట్లలోకి చేర్చగలిగామన్నారు.

 

 

జగన్ దళిత పక్షపాతే.. మేం అంగీకరిస్తున్నాం.. ఐదేళ్ల టీడీపీ హయాంలో దళితులు, బడుగు, బలహీనవర్గాలకు చేసిన కార్యక్రమాలపై... వైయస్‌ఆర్‌ సీపీ ఏడాది పాలనలో చేసిన మేలుపై ఎక్కడైనా శాఖల వారీగానైనా, పథకాల వారీగానైనా.. ఏ విషయంలో తీసుకున్నా చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, చంద్రబాబు సిద్ధమా అంటూ మంత్రి ఆదిమూలపు సురేష్‌ సవాల్‌ విసిరారు.

 

IHG

 

దళితులను కించపరుస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను దళిత సమాజం ఎప్పటికీ మర్చిపోదని సురేశ్ అన్నారు. దళితుల పేరు చెప్పి ఇష్టం వచ్చినట్లుగా రాష్ట్ర ఖజానాను టీడీపీ దోచుకుందని మంత్రి ఆదిమూలపు సురేష్‌ సవాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై అంత చులకన భావం ఉంది కాబట్టే నాలుగేళ్లుగా ఆ మాటను చంద్రబాబు ఉపసంహరించుకోలేదన్నారు. కేవలం దళితులను ఓటు బ్యాంక్‌గా చూసి. కులాలు, వర్గాల మధ్య చిచ్చుపెట్టే చంద్రబాబు రాజకీయం చేశాడని మంత్రి ఆదిమూలపు సురేష్‌ సవాల్‌ దుయ్యబట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: