ప్రపంచంలో ప్రజలను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి రోజు రోజు కీ దాని ఉదృతి పెంచుకుంటూ పోతుంది.  కరోనా వల్ల మనిషి చనిపోవడం మాత్రంమే కాదు మరింత మందికి ప్రాణా హాని జరుగుతుంది.   విచిత్రం ఏంటంటే కరోనా లక్షణాలు లేనట్టు ఉన్న వారికి కూడా కరోనా పాజిటీవ్ తెలుతుంది.  తమకు ఎలాంటి రోగ లక్షణాలు లేవని ఆరోగ్యంగా ఉన్నామని అనకుంటూ అందరితో కలిసి మెలిసి తిరుగుతున్నారు.. తీరా చూస్తే కరోనా పాజిటీవ్ రావడంతో కంగారు పడుతున్నారు. అప్పటికే రోగి ఎవరిని కలిశారో వారందరినీ క్వారంటైన్ కి తరలిస్తున్నారు.  అయితే ఓ వ్యక్తి పాపం కరోనాని అరికట్టే పనిలో భాగంగా పది మందికి మంచి చేయాలనే సదుద్దేశంతో మాస్క్ లు పంచాడు.. కానీ అక్కడే ఆయనకు బ్యాడ్ టైమ్ మొదలైంది. 

 

 ఈ ఘటన తమిళనాడులోని తంజావూర్ జిల్లా వవూసి నగర్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడి 'మక్కల్ పాదై' స్వచ్ఛంద సంస్థ తరపున ఓ యువకుడు చెన్నైకి వెళ్లి, కరోనా కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పర్యటించి, ప్రజలకు ఉచితంగా మాస్క్ లను అందించాడు.  అయితే తాను చేస్తున్న మంచి పనికి  ప్రజల నుంచి వస్తున్న ప్రశంసలకు ఉప్పొంగిపోయాడు.. ఇలాంటి మంచి పనులు మరిన్ని చేయాలనుకున్నాడు. కాగా,   అతను తిరిగి తంజావూరు వెళ్లిన తరువాత, అనారోగ్యం బారిన పడగా, విషయం తెలుసుకున్న వైద్యులు నమూనాలను పరీక్షించగా, కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. కాగా, ఇప్పటివరకూ ఆ జిల్లాలో 112 మందికి వైరస్ సోకగా, 88 మంది డిశ్చార్జ్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: