తెలంగాణ ప్రభుత్వం ఎన్ని చర్యలు కఠినంగా తీసుకుంటున్న గ్రేటర్ హైదరాబాద్ ను మాత్రం అస్సలు ఆగడం లేదు. రాష్ట్రం అంతా కలిపి ఒక ఎత్తు గ్రేటర్ హైదరాబాదు ఒక ఎత్తు అన్నట్లు అయిపోయింది తెలంగాణ ప్రభుత్వానికి. రాష్ట్రం మొత్తంలో 30 శాతం కేసులు వస్తే ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 70 శాతం కేసులు రోజు వస్తున్నాయి. నిజంగా వీటివల్ల రోజురోజుకు భయాందోళన పరిస్థితి హైదరాబాద్లో నెలకొంది. స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాల్సిన ప్రజలు వారి నిర్లక్ష్యం కారణంగా ఈ మహమ్మారి రోజురోజుకీ విస్తరిస్తోంది. ముఖ్యంగా మాస్కులు ధరించడంలో అలసత్వం వహించడం అక్కడ వారి కొంప ముంచుతుంది. చాలామంది ప్రమాదమని తెలిసినా కూడా మాస్కులు ధరించకుండా రోడ్ల మీదికి అలా స్వేచ్ఛగా వచ్చేస్తున్నారు. వైద్యులు ఎంత గట్టిగా హెచ్చరించిన కూడా ప్రజలు ఈ చెవిన విని ఆ చెవిన వదిలేస్తున్నారు. ఎదుటివారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేక మాట్లాడినప్పుడు నోటిలో నుంచి వచ్చే నీటి తుంపరల నుంచి మాస్కులు మాత్రమే రక్షిస్తాయి అని చెప్పిన కొందరికి ఇది అసలు చెవికి ఎక్కడం లేదు. 

 

 

ఇంకొంత మంది ఏదో మాస్క్ పెట్టుకోవాలంటే పెట్టుకోన్నట్టు మాస్కులు ధరిస్తున్నారు. నిజానికి మాస్కులు ధరించడం పై చాలా మందికి అవగాహన లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా ముక్కు కింది భాగంలో అంటే ముక్కు బయటికి వచ్చేలా మాస్కు ధరించి కూడదు. అంతేకాకుండా చాలా వదులుగా ధరిస్తే అసలు దాని వల్ల ఉపయోగం ఏమీ లేదు. కొంతమంది ముక్కు రంధ్రాలను సగం భాగం వదిలేసి మాస్క్ లను ధరిస్తున్నారు. అది కూడా సరైన విధానం కానేకాదు. కొందరైతే బయటి ప్రాంతాల్లో లేదా పని ప్రాంతాల్లో మాస్క్ ను కిందికి జరిపి రిలాక్స్ అవుతారు. ఇది కూడా అంత మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనం భౌతిక దూరం పాటించడం. ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా దాన్ని మాత్రం మనం పాటించం. మాస్కులు తొలగించిన సందర్భంలో మా యొక్క ముందు భాగాన్ని ముట్టుకోకుండా ఉండేలా చూడాలి. వీలైతే ప్రతిరోజూ మాస్క్ లను శుభ్రం చేసుకునేలా ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: