ప్రపంచాన్ని చుట్టేస్తున్న కరోనా ఇప్పుడు మన దేశంలో కూడా బీభత్సం సృష్టిస్తుంది. ఫిబ్రవరిలో మొదలైన  ఈ కరోనా వైరస్ ప్రభావం రోజు రోజు కీ పుంజుకుంటూ వెళ్తుంది.  మార్చి 24 నుంచి కరోనాని కట్టడి చేయడానికి లాక్ డౌన్ ప్రకటించింది ప్రభుత్వం. అప్పటి నుంచి కరోనా కేసులు మాములుగా ఉన్నా ఈ మద్య లాక్ డౌన్ సడలింపులు చేసిన తర్వాత జనాలు విచ్చలవిడిగా బయటకు రావడంతో మళ్లీ కేసులు మరింతగా పుంచుకుంటున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో 20 మంది మెట్రో రైలు కార్పొరేషన్‌లో పని చేస్తున్న ఉద్యోగులకు కరోనా వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. తమ సంస్థలో పని చేసే వివిధ స్థాయి ఉద్యోగులకు వైరస్ సోకినట్టుగా ఆ సంస్థ ప్రకటించింది.

 

వీరంతా ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్టుగా వెల్లడించారు. వారిని ఐసోలేషన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. గత రెండు నెలల నుంచి ఢిల్లీలో కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లాక్ డౌన్  విషయంలో కఠిన ఆంక్షలు జారీ చేసిన విషయం తెలిసిందే.  అయితే ముందు జాగ్రత్తగా ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించారు. సిబ్బందిలో కొంత మందికి వైరస్‌ సోకినా మెట్రో సేవలను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అధికారులు వెల్లడించారు. 

 

 మెట్రోరైలు అధికారులు మాస్క్, గ్లోవ్స్ ధరించిన బాలిక పోస్టరును అధికారులు  సోషల్ మాద్యంలో తెలిపారు.  ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాక అన్ని రకాల ముందుజాగ్రత్తలు తీసుకొని మెట్రోరైలు సర్వీసులు నడిపేందుకు తాము సిద్ధమని తెలిపారు. ఇప్పటికే అన్ని రైల్వేస్టేషన్లను శానిటైజ్ చేయించి తమ సేవలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: